• దేశంలో కెల్లా అత్యధిక గురుకుల విద్యాలయాలు కలిగిన ఏకైక రాష్ట్రం తెలంగాణ
• రాష్ట్రవ్యాప్తంగా 1002 గురుకుల పాఠశాలలో 5,99,537 మంది విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యాబోధన జరుగుతుంది
• రాష్ట్రంలోని 26,815 ప్రభుత్వ పాఠశాలల్లో 23,35,952 మంది పిల్లలు చదువుకుంటున్నారు
•సర్వశిక్షా అభియాన్ క్రింద 44,588 పనులను చేపట్టి 38,182 పనులను పూర్తి చేశారు
విద్యార్థులకు మంచి విద్య, మెరుగైన వసతి, మంచి భోజనం పెట్టాలని, భావితరాలు ఆరోగ్యంగా, ఉన్నతంగా ఎదగాలని తెలంగాణ ప్రభుత్వ ఆశయం.. ఆలోచన. విద్యార్థులపై పెట్టే ఖర్చు భావితరం బాగుకోసం పెట్టే పెట్టుబడిగా ప్రభుత్వం భావిస్తున్నది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అందుకే విద్యార్థుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం విద్యావ్యవస్థలో తీసుకొచ్చిన సంస్కరణలు కూడా సత్ఫలితాలనిస్తున్నాయి. రాష్ట్రంలోని ప్రభుత్వ, స్థానిక సంస్థలకు చెందిన బడులకు ప్రైవేటు విద్యా సంస్థల నుంచి విద్యార్థుల వలసలు పెరుగుతున్నాయి. 2022-23 విద్యాసంవత్సరంలో విద్యార్థుల ప్రవేశాల సంఖ్య గణనీయంగా పెరిగింది. లక్షకు పైచిలుకు విద్యార్థులు కొత్తగా ప్రభుత్వ స్కూళ్లలో ప్రవేశాలు పొందారు. నాణ్యమైన విద్యావిధానం, ఇంగ్లిష్ మీడియంలో బోధన, సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం, పౌష్టికాహారం వంటి విద్యాభివృద్ధి పథకాలను రాష్ట్ర ప్రభుత్వం సమర్థంగా అమలు చేస్తున్న నేపథ్యంలో విద్యార్థుల నమోదు పెరిగింది.
విద్యారంగంలో వినూత్న వికాసం
• దేశంలో కెల్లా అత్యధిక గురుకుల విద్యాలయాలు కలిగిన ఏకైక రాష్ట్రం తెలంగాణ.
• రాష్ట్రవ్యాప్తంగా 1002 గురుకుల పాఠశాలలో 5,99,537 మంది విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యాబోధన జరుగుతున్నది.
• గురుకులాల్లో చదివే ప్రతి విద్యార్థిపై సంవత్సరానికి 1 లక్షా 25 వేల రూపాయలు ప్రభుత్వం వెచ్చిస్తున్నది.
• అన్ని రకాల విద్యాలయాల్లో, హాస్టళ్లలో సన్న బియ్యంతో భోజనం పెడుతూ, ఉచితంగా పుస్తకాలు, యూనిఫాం అందజేస్తున్నది.
• మన ఊరు- మన బడి, మన బస్తీ-మన బడి పథకం తో విద్యా వ్యవస్థ రూపురేఖలు మార్చనున్నది. రాష్ట్రంలోని పాఠశాలలను దశలవారీగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం 7,289 కోట్లు కేటాయించింది.
• రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో బోధనను ప్రవేశపెట్టడం జరిగింది.
• రాష్ట్రంలోని 26,815 ప్రభుత్వ పాఠశాలల్లో 23,35,952 మంది పిల్లలు చదువుకుంటున్నారు.
•సర్వశిక్షా అభియాన్ క్రింద 44,588 పనులను చేపట్టి 38,182 పనులను పూర్తి చేశారు.
ప్రభుత్వ పాఠశాలల్లో పెరుగుతున్న హాజరు శాతం
• రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో డ్రాపౌట్స్ తగ్గుతూ, రిటెన్షన్ (విద్యా సంవత్సరం చివరి వరకు కొనసాగడం) పెరుగుతున్నాయని సర్వశిక్షా అభియాన్ నివేదికలో తెలిపింది.
• తెలంగాణ ప్రభుత్వం ప్రాథమిక విద్యాభివృద్ధి కోసం మధ్యాహ్న భోజన పథకం, హాస్టళ్లకు సన్నబియ్యం, ఉచిత పుస్తకాలు, రెండు జతల యూనిఫారాల పంపిణీ, వందశాతం మెస్ చార్జీలు తదితర కార్యక్రమాల వల్ల పాఠశాలల్లో డ్రాపౌట్స్ తగ్గి, హాజరు శాతం పెరిగింది.
• టీ-సాట్ తన నెట్వర్క్ ఛానళ్ల ద్వారా పాఠశాల విద్యపై దృష్టి కేంద్రీకరించి ఈ-లెర్నింగ్ ద్వారా విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నది.
మన ఊరు-మన బడి / మన బస్తీ – మన బడి కార్యక్రమం :
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 3 సంవత్సరాలలో, 3 దశలుగా, 26,065 పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను సమగ్రంగా అభివృద్ధి చేయడం, బలోపేతం చేయడం కోసం రూ.7289 కోట్లతో మన ఊరు-మన బడి / మన బస్తీ-మన బడి కార్యక్రమాన్ని అమలు చేస్తున్నది.
ఈ కార్యక్రమాన్ని 12 అంశాలుగా విభజించి చేపట్టింది.
1.నీటి సౌకర్యం ఉన్న మరుగుదొడ్లు
2. విద్యుద్దీకరణ
3. తాగునీటి సరఫరా
4. విద్యార్థులు, సిబ్బంది కోసం ఫర్నిచర్
5. పాఠశాలలకు పెయింటింగ్
6.మరమ్మతులు
7.బోర్డుల ఏర్పాటు
8.కాంపౌండ్ గోడలు
9. కిచెన్ షెడ్లు
10. కొత్త తరగతి గదుల నిర్మాణం
11.ఉన్నత పాఠశాలల్లో భోజనశాలలు
12.డిజిటల్ తరగతి గదుల ఏర్పాటు
•ప్రాథమికంగా మొదటి దశలో 2021-22 సంవత్సరానికి గాను 9123 పాఠశాలలు అంటే 35% ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, బలోపేతానికై రూ.3497.62 కోట్ల అంచనా బడ్జెట్‌తో పనులు చేపట్టడం జరిగింది.
•ఈ కార్యక్రమం జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్లచే నిర్వహించబడుతుంది.
•ప్రజల భాగస్వామ్యం, పారదర్శకత, నిర్దేశిత ఆర్థిక పరిమితితో త్వరితగతిన పనులు పూర్తి చేసేందుకు పాఠశాల నిర్వహణ కమిటీలు (SMC) చొరవ తీసుకుంటాయి.
• సమగ్ర శిక్ష, ఎసిడిపి, జెడ్ పి, ఎంపి నిధులు, ఎంజిఎన్ఆర్ఈజిఎస్, టి ఎస్ పి, ఎస్ సి ఎస్ పి, నాబార్డ్, జిల్లా గ్రంథాలయ సంస్థల నిధులను ఈ కార్యక్రమాలకు వాడుతున్నారు.
• అన్ని పనులను పారదర్శకంగా చేపట్టేందుకు పరిపాలనా, ఆర్థిక ప్రక్రియలను ఎండ్-టు-ఎండ్ సాఫ్ట్ వేర్ ప్రోగ్రామ్ ద్వారా పర్యవేక్షించడం జరుగుతున్నది.
•2021-22 సంవత్సరానికి గాను మన ఊరు – మన బడి / మన బస్తి – మన బడి కార్యక్రమం ద్వారా మూడో వంతు పాఠశాలల్లో పనులను చేపట్టడం జరిగింది. ఈ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల సంఖ్య 12,96,167. ఇందు కోసం చేపట్టిన పనుల వ్యయం రూ.3,497.62 కోట్లు.
పాఠశాల విద్యాశాఖలో ప్రభుత్వం సాధించిన విజయాలు
• విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం.
• విద్యార్థుల అభ్యాస స్థాయి, సామర్థ్యాల మెరుగుదల.
• విద్యార్థుల నమోదు, హాజరు శాతం మెరుగుదల
• నాణ్యమైన కార్పొరేట్ స్థాయి విద్యను అందించుట
ఇంటర్మీడియట్ విద్యా శాఖ
ఇంటర్మీడియట్ విద్యాశాఖ చేపట్టిన కార్యక్రమాలు, సాధించిన ప్రగతి
• ప్రభుత్వ కార్యాచరణతో ఇంటర్మీడియట్ కళాశాలల్లో ప్రతి ఏటా 10 శాతం విద్యార్థుల సామర్థ్యం పెరుగుతూ వస్తున్నది.
• 2015-16 విద్యా సంవత్సరం నుండి ప్రభుత్వ జూనియర్ కాలేజీల విద్యార్థుల నుండి ఎలాంటి ట్యూషన్ ఫీజును వసూలు చేయకుండా ప్రభుత్వం పుస్తకాలను ఉచితంగా పంపిణీ చేస్తున్నది.
• విద్యార్థులు, కళాశాల సిబ్బంది హాజరును పర్యవేక్షించేందుకు సిసి కెమరాలు, బయో మెట్రిక్ డివైజ్ లను ప్రభుత్వం జూనియర్ కళాశాలల్లో అమర్చింది.
• పోటీ ప్రపంచంలో పెరుగుతున్న ఒత్తిడితో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ప్రతీ జూనియర్ కాలేజీలో స్టూడెంట్ కౌన్సిలర్లను నియమించి విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు కృషి చేస్తున్నది.
• విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే రీతిలో “పిక్టోరియల్ మెథడ్” పద్ధతిలో డిజిటల్ పాఠ్యాంశాలను రూపొందించి అందిస్తున్నది
• పరీక్షల సమయంలో విద్యార్థుల్లో ఒత్తిడిని తగ్గించేందుకు సైకాలజిస్ట్ లను నియమించారు.
• ఆన్లైన్, యాప్, ఫేస్ బుక్, ట్విట్టర్, హెల్ప్ డెస్క్ ల ద్వారా విద్యార్థుల సమస్యలను పరిష్కరించేందుకు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టమ్ (బిఐజిఆర్ఎస్) ను ప్రభుత్వం ప్రవేశపెట్టింది.
• మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా 48 కొత్త భవనాలు, 186 అదనపు క్లాస్ రూమ్ లు, 267 ప్రహరీ గోడలు, 350 ఆర్వో ప్లాంట్ లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వీటితో కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా 18 కొత్త భవనాలు, 14 అదనపు తరగతులు, 4 ప్రహారీ గోడలను చేపట్టడం జరిగింది.
• వృత్తి విద్యా కోర్సుల్లో నాణ్యమైన విద్యాబోధనకు సలహాల కోసం గాను భువనేశ్వర్ లోని సెంచూరియన్ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ తో పాటు నైపుణ్య శిక్షణ, వ్యవస్థాపన కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పలు సంస్థలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నది.
• ఈ ఆఫీస్ విధానాన్ని ప్రవేశపెట్టడం ద్వారా ఫైళ్ళకు సంబంధించిన అన్ని ప్రక్రియలను పారదర్శకంగా, వేగవంతంగా నిర్వహిస్తున్నారు.
ఉన్నత విద్యాశాఖ – కళాశాల విద్య
2 జూన్ 2014 నుండి 31 మార్చి 2023 వరకు చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల నివేదిక
• ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో విద్యార్థుల నమోదు కు సంబంధించి తెలంగాణ స్థూల నమోదు నిష్పత్తి 36.2 ఇది జాతీయ సగటు కంటే ఎక్కువ. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంస్కరణల కారణంగా ఉన్నత విద్యార్జనలో నాణ్యత ప్రమాణాలు ఆశించిన స్థాయిలో పెరిగాయి.
• ప్రతి అసెంబ్లీ నియోజక వర్గంలో ఒక ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఉండేలా ఉన్నత విద్యాశాఖ చర్యలు చేపట్టింది.
• 34 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలకు కొత్త భవనాల నిర్మాణం కోసం నిధులు కేటాయించారు.
• అత్యంత పారదర్శకంగా డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్లను చేపట్టేందుకు 2016-17 విద్యా సంవత్సరంలో ఉన్నత విద్యా శాఖ దోస్త్ (డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ ఆఫ్ తెలంగాణ-DOST) విధానాన్ని ప్రవేశపెట్టింది. 2017 సంవత్సరంలో దోస్త్ అప్లికేషన్ కు టెక్నాలజీ విభాగంలో స్కోచ్ ప్లాటినం అవార్డు లభించింది.
• విద్యార్థులకు సబ్జెక్ట్ ల ఎంపికలో విస్తృత పరిధిని కల్పించేందుకు “ఛాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టం (సిబిసిఎస్) మరియు బకెట్ సిస్టమ్” ను ప్రవేశపెట్టారు.
• కోర్సుల రీడిజైన్ తో ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్లు 68 శాతం పెరిగాయి.
• విద్యారంగంలో వెనుకబడిన జిల్లాల్లో ఏడు మోడల్ డిగ్రీ కాలేజీలను స్థాపించారు.
• తెలంగాణ స్కిల్ అండ్ నాలెడ్జ్ సెంటర్ ద్వారా విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంచి వారి ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తున్నారు.
• డిగ్రీ, పిజి కాలేజీల్లోని విద్యార్థులు వారే స్వతహాగా స్టార్టప్ లు, వెంచర్లు ప్రారంభించేందుకు ఎంటర్ ప్రెన్యూర్ షిప్ డెవలప్ మెంట్ సెల్ లను ప్రారంభించింది.
• డిగ్రీ కాలేజీల్లోని విద్యార్థులకు ప్రాజెక్టు ఆధారిత శిక్షణ కోసం జిజ్ఞాస అనే విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది.
• డిగ్రీ కాలేజీల్లో విద్యా బోధన కోసం రెగ్యులర్ అధ్యాపకులతో పాటు కాంట్రాక్టు లెక్చరర్లు, గెస్ట్ లెక్చరర్లు సేవలు అందిస్తున్నారు. రాష్ట్ర ఆవిర్భావానికి ముందు 450 ఉన్న అధ్యాపకుల సంఖ్య 31 మార్చి 2023 నాటికి 1940 కి పెరిగింది.
• ఉత్తమ నాణ్యతా ప్రమాణాలను పాటించినందుకుగాను 2019-20 విద్యా సంవత్సరంలో 96 కాలేజీలకు ISO సర్టిఫికేషన్ లభించింది. దీన్ని మరో మూడు సంవత్సరాల పాటు పొడిగించారు.
• ఉన్నత విద్యా శాఖ తెలంగాణ సాహిత్య అకాడమీ సహకారంతో “మన ఊరు – మన చరిత్ర” ప్రాజెక్టు వర్క్ ను చేపట్టి గ్రామాల చరిత్రను గ్రంథస్తం చేస్తున్నది.
• “స్టూడెంట్ స్టడీ టూర్ టూ యూ కే ” కార్యక్రమంలో భాగంగా యూనివర్సిటీ ఆఫ్ గ్లాస్గోవ్ లో షార్ట్ టర్మ్ సర్టిఫికెట్ కోర్సులను చదివేందుకు బ్రిటీష్ కౌన్సిల్ సహకారం తీసుకుంటున్నది. ఇందులో భాగంగా మెరిట్ సాధించిన 15 మంది ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థినులను ఎంపిక చేస్తారు. వీరిలో ఐదుగురు విద్యార్థినులను ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు, ఆరుగురు విద్యార్థినులను సోషల్ వెల్ఫేర్ డిగ్రీ కాలేజీలు, నలుగురు విద్యార్థినులను ట్రైబల్ వెల్ఫేర్ డిగ్రీ కాలేజీల నుండి ఎంపిక చేస్తారు.
సాంకేతిక విద్య:
• తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత సాంకేతిక విద్యా శాఖ అవసరాల కోసం 127.33 కోట్ల రూపాయల ఖర్చుతో 17 కొత్త భవనాలను నిర్మించారు.
• రాష్ట్ర ఏర్పాటు తర్వాత 12 కొత్త ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలను స్థాపించారు. వీటిలో 4 మహిళా పాలిటెక్నిక్ లు కాగా ఒకటి ఎస్టీ బాలురకు కేటాయించారు. దీంతో ప్రభుత్వ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో విద్యార్థినీ, విద్యార్థుల సంఖ్య 10,760 నుండి 12,300 కు పెరిగింది.
• 390 మంది కాంట్రాక్టు లెక్చరర్లు, 129 మంది కాంట్రాక్టు వర్కషాప్ అటెండెంట్లను రెగ్యులరైజ్ చేశారు.
• రాష్ట్ర ఏర్పాటు తర్వాత సిరిసిల్ల, వనపర్తి లలో జవహర్ లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ కాలేజీలు స్థాపించారు.
• 2021-22 విద్యా సంవత్సరంలో సంగారెడ్డి జిల్లా సుల్తాన్ పూర్ లో జేఎన్ టీయూహెచ్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ ని స్థాపించారు
• గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్, సికింద్రాబాద్ లో ఎమర్జింగ్ టెక్నాలజీ లైన ఏ ఐ, ఎం ఎల్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్, బిగ్ డేటా కోర్సులను ప్రవేశపెట్టారు.
• సాంకేతిక విద్యా శాఖకు చెందిన అన్ని కార్యాలయాలను, ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలను ఈ-ఆఫీస్ ద్వారా అనుసంధానించి ఫైళ్ళ ప్రాసెసింగ్ విధానాన్ని పారదర్శకంగా నిర్వహిస్తున్నారు.
• విద్యార్థులు, సిబ్బందిలో క్రమశిక్షణను పెంపొందించేందుకు అన్ని పాలిటెక్నిక్ కాలేజీల్లో ఆధార్ ఆధారిత బయో మెట్రిక్ హాజరు విధానాన్ని ప్రవేశపెట్టారు.
• విద్యార్థుల్లో మార్కుల వల్ల కలిగే మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు గ్రేడింగ్ విధానాన్ని తీసుకొచ్చారు
• డిప్లొమా పరీక్షల్లో జవాబు పత్రాల మూల్యాంకనానికి ఆన్ స్క్రీన్ డిజిటల్ ఎవల్యూషన్ సిస్టమ్ (ఓ ఎస్ డి ఈ ఎస్) విధానాన్ని ప్రవేశపెట్టారు.
• డిప్లొమా కోర్సుల్లో ఓపెన్ బుక్ సిస్టమ్ విధానాన్ని ప్రవేశపెట్టారు.
• సాంకేతిక విద్యాశాఖ తీసుకొచ్చిన సంస్కరణలతో డిప్లొమా కోర్సుల పరీక్ష ఫలితాల్లో 39 శాతం పురోగతి సాధ్యమైంది.