హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం వ్యవసాయ ఆధారిత ఉత్పత్తుల ఎగుమతుల్లో టాప్-2 గా నిలిచింది. వివిధ దేశాలకు ఉత్పత్తులను ఎగుమతి చేయడంలో మొదటి స్థానంలో మహారాష్ట్ర ఉండగా, రెండో స్థాన్నాన్ని తెలంగాణ రాష్ట్రం దక్కించుకుంది. రాష్ట్ర ప్రభుత్వం పంటల సాగు విస్తీర్ణం పెరుగుదల కోసం చేసిన ప్రయత్నాలు, మరియు రైతుల కిస్తున్న ప్రోత్సాహం వల్లనే ఈ ఫలితం లభించింది. కేవలం ఐదేళ్లలో ఊహించని ప్రగతిని సాధించిన ఘనత మన రాష్టానికి దక్కింది. తాజా లెక్కల ప్రకారం రాష్ట్రం నుంచి వ్యవసాయ ఎగుమతులు భారీగా పెరిగాయి.
వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల శాతం ఒక్కసారిగా 40శాతానికి పెరిగి, రూ.10వేల కోట్ల మార్కును దాటింది. ప్రభుత్వం కూడా రాష్ట్రంలో పంటల సాగు విస్తీర్ణం పెరుగుదల కోసం చేసిన ప్రయత్నాలు, రైతులకిస్తున్న ప్రోత్సాహకాలు ఫలించాయి. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు పథకం నేడు దేశానికి ఆదర్శంగా నిలిచింది. రాష్ట్రంలో ఇంతగా సాగు పెరగడానికి రైతులు కూడా సాంకేతికత పద్ధతులను వినియోగించడమే. అదే సమయంలో వ్యాపార లావాదేవీలు 2017-18 నుంచి 2021-22 వరకు తెలంగాణలో రూ.5,000 కోట్ల నుంచి రూ.10,000 కోట్లకు పెరిగాయి. తెలంగాణ ఎగుమతుల్లో సుగంధ ద్రవ్యాలు, తృణధాన్యాలు, పత్తి, మాంసం మొదలగు వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులు ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రం నూనె గింజల సాగు విస్తీర్ణాన్ని పెంచడం పై ప్రభుత్వం దృష్టి సారిస్తోంది.