Mission Telangana

అబ్ కీ బార్…కిసాన్ సర్కార్ : మంత్రి హరీశ్ రావు

 సీఎం కేసీఆర్ గారి ఆలోచనతో ప్రారంభించిన రైతుబంధు వ్యవసాయాన్ని, పండగ చేసి రైతన్నను రాజును చేసింది. ఎకరాకు ఏడాదికి 10 వేల చొప్పున ఇప్పటి వరకు 10 విడతలలో రూ.65 వేల కోట్లు నేరుగా రైతుల ఖాతాలలో జమ చేసి, అద్భుతమైన రైతు సంక్షేమ పథకంగా దేశానికి రోల్ మోడల్ అయ్యింది. అందుకే సీఎం కేసీఆర్ గారు అనుసరిస్తున్న వ్యవసాయ విధానాలు, ఎత్తుకున్న జాతీయ నినాదం దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరినీ ఆలోచింపచేస్తున్నాయి. అబ్ కీ బార్ .. కిసాన్ సర్కార్ అంటూ బీఆర్ఎస్ ను స్వాగతిస్తున్నాయని మంత్రి హరీష్ రావు ట్వీట్ చేసారు.