mt_logo

71 కోట్ల రూపాయల నిధులతో పట్టణాల్లోని అన్ని బడుల్లో ‘స్వచ్ఛ బడి’ : మంత్రి కేటీఆర్ 

తెలంగాణ దశాబ్ది ఆవిర్భావ దినోత్సవాలను పురస్కరించుకొని హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో నిర్వహించిన పట్టణ ప్రగతి సంబరాల్లో మంత్రి కే.  తారక రామారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ.. మన ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక సాధారణ పౌరుడి కోణంలో ఆలోచించి, ప్రభుత్వ పథకాలను పరిపాలన విధానాలను రూపొందిస్తారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పట్టణాల్లో పారిశుద్ధ్యానికి అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నది. ఇందులో భాగంగానే లెగసి డంప్ కోసం బయో మైనింగ్, డ్రై రిసోర్స్ సెంటర్లను ,మానవ వ్యర్థాలశుద్ధి ప్లాంట్ల ఏర్పాటు,పబ్లిక్ టాయిలెట్ల ఏర్పాటు వంటి అనేక కార్యక్రమాలను చేపట్టారు. హరిత పట్టణాల ఏర్పాటు దిశగా పార్కుల ఏర్పాటు, నర్సరీల ఏర్పాటు, నగరవనాలు, అర్భన్ లంగ్ స్పేస్ ల ఏర్పాటు వంటి అనేక కార్యక్రమాలను చేపట్టాం.పట్టణాల్లో ఏడు శాతం గ్రీనరీ పెరిగింది. 

క్రమం తప్పకుండా ప్రతీ నెల మౌలిక వసతుల ఏర్పాటు మరియు నిర్వహణ కొరకు పట్టణ ప్రగతి కింద రూ.4537 కోట్లు నిధులు విడుదల చేయటం జరిగింది. తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ & డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (TUFIDC), పౌర మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను చేపట్టేందుకు పట్టణాలకు రూ.4706 కోట్ల ఆర్థిక సహాయాన్ని అందించాం. పట్టణాల్లోని చెరువుల బలోపేతం, సుందరీకరణ, అభివృద్ధిని చేపడుతున్నాం అని తెలిపారు.