mt_logo

రాబోయే రోజులకు కూడా మాకు ముఖ్యమంత్రి అభ్యర్థి ఉన్నారు: మంత్రి పువ్వాడ అజయ్

రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఖమ్మంలో చేపట్టిన ర్యాలీలో మంత్రి పువ్వాడ అజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  కేటీఆర్ లాంటి యువ నాయకులు రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి అభ్యర్థి అవ్వగలిగే సత్తాతో ఉన్నారు. ఇవ్వాళ ప్రతిపక్షాలను అడిగితే మీ ముఖ్యమంత్రి పేరు చెప్పమంటే సిద్ధంగా ఎవరు లేరు. కనీసం ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో చెప్పమంటే కూడా వారి దగ్గర సమాధానం లేదు.కానీ మాకు ఇప్పుడు ముఖ్యమంత్రి ఉన్నారు, రాబోయే రోజులకు కూడా ముఖ్యమంత్రి అభ్యర్థి ఉన్నారు. అంత గొప్ప క్వాలిటీ ఉన్న మహనీయుడు కేటీఆర్ అని చెప్పారు.