mt_logo

భక్తులు ఇబ్బంది పడకుండా అమ్మవారి కల్యాణానికి పటిష్టమైన ఏర్పాట్లు

  •  ప్రభుత్వం ఆధ్వర్యంలో పటిష్టమైన ఏర్పాట్లు
  • జూన్ 19 న ఎదుర్కోళ్ళు, 20 న అమ్మవారి కళ్యాణం, 21 న రధోత్సవం
  •  రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాల సమర్పణ
  • మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమీక్ష సమావేశం

హైదరాబాద్: ఎంతో చరిత్ర కలిగిన బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేలా  ప్రభుత్వం ఆధ్వర్యంలో పటిష్టమైన ఏర్పాట్లు చేయనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. వచ్చే నెల 20 వ తేదీన జరిగే బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణం నిర్వహణ, ఏర్పాట్లపై MCHRD మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అద్యక్షతన దేవాదాయ, GHMC, రెవెన్యు, పోలీసు, ట్రాఫిక్, ఎలెక్ట్రికల్ తదితర శాఖల అధికారులతో సమీక్ష సమావేశం జరిగింది.  ఈ సందర్బంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ జూన్ 19 న ఎదుర్కోళ్ళు, 20 న అమ్మవారి కళ్యాణం, 21 న రధోత్సవం నిర్వహించడం జరుగుతుందని వివరించారు. 

15 లక్షల వరకు వస్తారని అంచనా.. 

అమ్మవారి కళ్యాణాన్ని తిలకించేందుకు నగరం నుండే కాకుండా రాష్ట్రం నలుమూలలు, ఇతర రాష్ట్రాల నుండి కూడా లక్షలాది మంది భక్తులు వస్తారని పేర్కొన్నారు. వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు  ప్రతి సంవత్సరం అమ్మవారి కళ్యాణం సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేస్తూ ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నామని తెలిపారు. గత సంవత్సరం అమ్మవారి కళ్యాణానికి 8 లక్షల మంది వరకు భక్తులు వచ్చారని, ఈ సంవత్సరం 15 లక్షల వరకు వస్తారని అంచనా వేస్తున్నామని, అందుకు తగినట్లుగా అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుందని చెప్పారు. 

15 లక్షల వరకు వస్తారని అంచనా

అంతేకాకుండా అమ్మవారి కళ్యాణం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలను సమర్పిస్తూ వస్తున్నట్లు వివరించారు. అమ్మవారికి భ15 లక్షల వరకు వస్తారని అంచనాక్తులు మొక్కుల రూపంలో సమర్పించిన వెండితో ఆలయ ప్రధాన ద్వారం తలుపులకు వెండి తాపడం చేసే పనులను కళ్యాణం నాటికి పూర్తిచేయడం జరుగుతుందని పేర్కొన్నారు. కళ్యాణం నిర్వహణ, ఏర్పాట్లపై ఆయా శాఖల అధికారులకు మంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.