mt_logo

సీఎం కేసీఆర్ అన్ని వర్గాలను సమానంగా గౌరవిస్తూ మేలు చేస్తున్నారు: రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి 

తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి ని శాసనసభ భవనంలోని కమిటీ హాల్ లో ఈరోజు తెలంగాణ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల (TNGO) సంఘం ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసారు.  రాష్ట్ర మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్, TNGO రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్, జనరల్ సెక్రటరీ జగదీశ్, అసోసియేట్ ప్రెసిడెంట్ సత్యనారాయణ గౌడ్, రాష్ట్రంలోని 33 జిల్లాల అధ్యక్షులు, కార్యదర్శులు పాల్గొన్నారు. ముందుగా శాసనసభ సమావేశాలను ప్రేక్షక గ్యాలరీ ద్వారా TNGO సభ్యులు వీక్షించారు. 

ఈ సందర్భంగా స్పీకర్ పోచారం గారు మాట్లాడుతూ… ప్రభుత్వానికి ఉద్యోగులు గుండె లాంటి వారన్నారు. ప్రజాస్వామ్యంలో చట్టసభలు తీసుకున్న నిర్ణయాన్ని క్షేత్ర స్థాయిలో అమలు చేసేది కార్యనిర్వాహక వ్యవస్థ అని అన్నారు. ఉద్యోగులు క్షేత్ర స్థాయిలో పథకాలను సమర్ధవంతంగా అమలు చేస్తున్నారు కనుకే తెలంగాణ రాష్ట్రంలో మంచి ఫలితాలు వస్తున్నాయన్నారు. 

తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర మరువలేనిదన్నారు. తమ ఉద్యోగాలను పణంగా పెట్టి ఉద్యోగులు 42 రోజులు సమ్మె చేశారు.రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాలను సమానంగా గౌరవిస్తూ మేలు చేస్తున్నారని అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో TNGO భవన నిర్మాణానికి రూ. 30 లక్షలు మంజూరు చేశానని తెలిపారు.