mt_logo

బీజేపీకి బలం లేదు, కాంగ్రెస్‌కి అభ్యర్థులు లేరు, బీఆర్ఎస్‌కి తిరుగులేదు

గజ్వేల్: సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం లో మంత్రి హరీశ్ రావు సమక్షంలో బీఆర్ఎస్  పార్టీలో భారీగా చేరిన కాంగ్రెస్ , బీజేపీ నాయకులు, కార్యకర్తలు. వారికి రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  

 కాంగ్రెస్, బీజేపీ పై మంత్రి హరీశ్ రావు ఫైర్ అయ్యారు. గజ్వేల్ లో కాంగ్రెస్ పార్టీ ఖతం అయ్యింది, ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ డిపాజిట్లు గల్లంతు, పార్లమెంట్ లో బీజేపీని  ఎండగట్టడంలో కాంగ్రెస్ ఫెయిల్ అయ్యిందన్నారు. బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొడుతుంది, కేసీఆర్ మూడోసారి సీఎం అవుతారని ఆశాభావం వ్యక్తం చేసారు. బీజేపీకి బలం లేదు, కాంగ్రెస్ కి అభ్యర్థులు లేరు, బీఆర్ఎస్ కి తిరుగులేదన్నారు.