mt_logo

అకాల వర్షం – అపార నష్టం పై జూలై 31 సోమవారం నాడు రాష్ట్ర క్యాబినెట్ సమావేశం

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రాష్ట్ర కేబినెట్ సమావేశాన్ని ఈనెల జూలై 31 తేదీ సోమవారం నాడు మధ్యాహ్నం 2 గంటల నుంచి డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా.. దాదాపు 40 నుంచి 50 అంశాల మీద రాష్ట్ర క్యాబినెట్ చర్చించనున్నది. 

ఇందులో భాగంగా.. భారీ నుంచి అతి భారీ వర్షాల నేపథ్యంలో సంభవించిన వరదలు, ప్రభుత్వ చర్యలపై కేబినెట్ సమీక్షించనున్నది. రాష్ట్రంలో రైతాంగం వ్యవసాయ సాగు పనులు కొనసాగుతున్న నేపథ్యంలో.. అకాల వర్షాల వల్ల రాష్ట్ర వ్యవసాయ రంగంలో తలెత్తిన పరిస్థితులను అంచనా వేస్తూ అనుసరించవలసిన ప్రత్యామ్నాయ వ్యవసాయ విధానాల పై క్యాబినెట్ చర్చించనున్నది. రాష్ట్రంలో ఉధృతంగా కురిసిన వర్షాల వల్ల వాగులు, వంకలు పొంగి పొర్లి రోడ్లు తెగిపోవడం, రవాణా మార్గాలకు జరిగిన నష్టాన్ని అంచనా వేయనున్నది. అందుకు యుద్ధప్రాతిపదికన రోడ్లను తిరిగి పునరుద్ధరించడం కోసం చేపట్టనున్న చర్యలపై క్యాబినెట్ చర్చించనున్నది.