శాసనసభలో ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ శ్రీశైలం నిర్వాసితులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరగా దీనిపై స్పందించిన మంత్రి హరీష్ రావు నిర్వాసితులను ప్రభుత్వం ఆదుకుంటుందని, త్వరలోనే దీనిపై అత్యున్నత సమావేశం ఏర్పాటు చేసి నిర్వాసితుల సమస్యలపై చర్చిస్తామని తెలిపారు. అంతేకాకుండా నిర్వాసితుల్లో అర్హత ఉన్నవారికి ఉద్యోగాలు ఇస్తామని హరీష్ చెప్పారు.