- సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో బుద్ధిజం పూర్వ వైభవానికి చేస్తున్న కృషిని టెంపుల్ టూరిజం, మెడికల్ టూరిజం, ఇండస్ట్రియల్ పాలసీ, వ్యవసాయ విధానాలను శ్రీలంక దేశ ప్రధానమంత్రి దినేష్ గుణవర్ధన తెలుసుకొని అభినందనలు తెలిపారు.
- బుద్ధిజం పూర్వ వైభవానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషినీ శ్రీలంక దేశ ప్రధాని కొనియాడారు.
- తెలంగాణ ప్రాంతంలో బుద్ధిజం కు ఎంతో చారిత్రక ప్రాధాన్యం ఉందన్నారు.
- తెలంగాణ రాష్ట్రంలో బుద్ధిజం అభివృద్ధికి చేస్తున్న కృషిని శ్రీలంక దేశ ప్రధానమంత్రి దినేష్ గుణవర్ధనకు వివరించిన రాష్ట్ర మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్.

శ్రీలంక దేశ ప్రధానమంత్రి దినేష్ గుణవర్ధనతో రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు, యువజన సర్వీసుల శాఖల మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ శ్రీలంక రాజధాని కొలంబో లో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ బుద్ధిజం పూర్వ వైభవానికి చేస్తున్న కృషిని తెలియజేశారు.
తెలంగాణ ప్రాంతంలో బుద్ధుడు జీవించి ఉన్న కాలం నాటి నుండి బుద్ధిజం వ్యాప్తి చెందిందని మంత్రి వివరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బౌద్ధ ఆధ్యాత్మిక, విజ్ఞాన కేంద్రాలైన కోటిలింగాల, బాదం కుర్తి, ఫణిగిరి, నాగార్జున కొండ, నేలకొండపల్లి లాంటి పురాతన బౌద్ధ క్షేత్రాలను పరిరక్షించడంతో పాటు, పర్యాటకంగా, చారిత్రకంగా, పరిశోధనల పట్ల ఎంతో బాధ్యతతో వ్యవహరించి బుద్ధిజంకు పూర్వవైభవానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ శ్రీలంక దేశ ప్రధానమంత్రి దినేష్ గుణవర్ధనకు వివరించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ టెంపుల్ టూరిజం, మెడికల్ టూరిజం, ఇండస్ట్రియల్ పాలసీ ఇరిగేషన్ సిస్టం అభివృద్ధికి, రాష్ట్రంలో వ్యవసాయ అభివృద్ధికి చేపట్టిన కృషిని స్వయంగా శ్రీలంక దేశ ప్రధానమంత్రి గుర్తుచేశారని అందుకు సీఎం కేసీఆర్‌కి అభినందనలు తెలిపారన్నారు మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్. అంతర్జాతీయ స్థాయిలో ఆచార్య నాగార్జునుడు నడియాడిన చారిత్రక విజయపురి (నాగార్జునసాగర్ )లో సుమారు 200 ఎకరాల్లో 100 కోట్ల రూపాయల తో బుద్ధవనం ప్రాజెక్టును నిర్మించామన్నారు.
బౌద్ధ ఆధ్యాత్మిక పర్యాటకుల సౌలభ్యం కోసం శ్రీలంక నుండి హైదరాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయం వరకు రోజువారీగా విమానాలను నడపాలని రాష్ట్ర మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ శ్రీలంక ప్రధానమంత్రి కి విజ్ఞప్తి చేశారు. మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ చేసిన విజ్ఞప్తికి శ్రీలంక ప్రధాన మంత్రి సానుకూలంగా స్పందించారు. శ్రీలంక – తెలంగాణ రాష్ట్రాల మధ్య బౌద్ధ ఆధ్యాత్మిక, సాంస్కృతిక, బౌద్ధ ఆధ్యాత్మిక సత్సంబంధాలు మెరుగుపరుచుకునేందుకు సానుకూలంగా స్పందించారు.