హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, ప్రముఖ మైనారిటీ నేత సయ్యద్ ఇబ్రహీం… మంత్రులు కేటీఆర్, వి. శ్రీనివాస్ గౌడ్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఇబ్రహీంకు మంత్రి కేటీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానం పలికారు. తిరిగి సొంత గూటికి రావడం పట్ల ఇబ్రహీం సంతోషం వ్యక్తం చేశారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో మహబూబ్‌నగర్ ఎంతో అభివృద్ధి చెందిందని… ఇదే ఒరవడి కొనసాగాలంటే భారీ మెజారిటీతో మరోసారి ఆయనను గెలిపించాలని ఇబ్రహీం కోరారు. ప్రజలంతా సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమానికి పట్టం కట్టాలన్నారు. మైనారిటీల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.