mt_logo

ఈనెల 27న 21 వేల డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక

జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్‌లతో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీపై మంత్రి తలసాని సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎంతో పారదర్శకంగా రాజకీయ జోక్యం లేకుండా పార్టీలకు అతీతంగా ఇండ్ల పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే 2 విడతలలో 24,900 ఇండ్ల పంపిణీ పూర్తి చేశామన్నారు. 3,4 విడతలలో 10,500 చొప్పున 21 వేల ఇండ్ల పంపిణీకి ఏర్పాట్లు చేశామన్నారు.

ఈ నెల 27న ర్యాండమైజేషన్ పద్దతిలో ఆన్‌లైన్ డ్రా ద్వారా 21 వేల మంది లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందన్నారు. అక్టోబర్ 2వ తేదీన 10,500 అక్టోబర్ 5వ తేదీన మరో 10,500 ఇండ్ల పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.