హైదరాబాద్, జూన్ 12: ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ పాడె మోసిన మంత్రి సత్యవతి రాథోడ్.. ములుగు జిల్లా మల్లంపల్లిలోని ఆయన నివాసానికి చేరుకున్న మంత్రి కేటీఆర్.. జగదీశ్ పార్థివదేహానికి పుష్పాంజలి ఘటించారు. వారి కుటుంబానికి ధైర్యం చెప్పి కుసుమ జగదీష్ గారి పిల్లల్ని హక్కును చేర్చుకొని ఓదార్చారు. ఉద్యమ నేతకు కడసారి వీడ్కోలు పలికి నివాళి అర్పించారు. భారత రాష్ట్ర సమితి పార్టీ జెండాను జగదీష్ పార్థివదేహం పై కప్పారు. సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్, గుంటకండ్ల జగదీశ్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, కడియం శ్రీహరి, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇతర ప్రజాప్రతినిధులు అధికారులు అనంతరం జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ అంతిమ యాత్రలో పాల్గొన్నారు. అంత్యక్రియల ఏర్పాట్లను దగ్గర ఉండి పర్యవేక్షించిన మంత్రి సత్యవతి రాథోడ్.. జగదీశ్ పాడెను మోశారు.