mt_logo

కుసుమ జగదీష్ పిల్లల్ని అక్కున చేర్చుకొని.. బీఆర్ఎస్ జెండాను కప్పి కడసారి వీడ్కోలు పలికిన మంత్రి కేటీఆర్

హైదరాబాద్, జూన్ 12: తెలంగాణ ఉద్యమ నేత, ములుగు జెడ్పీచైర్మన్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కుసుమ జగదీష్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజయ్ కుమార్ ములుగుకు బయలుదేరి వెళ్లారు. ములుగు జిల్లా మల్లంపల్లిలోని ఆయన నివాసానికి చేరుకున్న మంత్రి కేటీఆర్‌.. జగదీశ్‌ పార్థివదేహానికి పుష్పాంజలి ఘటించారు. వారి కుటుంబానికి ధైర్యం చెప్పి కుసుమ జగదీష్ గారి పిల్లల్ని హక్కును చేర్చుకొని ఓదార్చారు. ఉద్యమ నేతకు కడసారి వీడ్కోలు పలికి నివాళి అర్పించారు. భారత రాష్ట్ర సమితి పార్టీ జెండాను జగదీష్ పార్థివదేహం పై కప్పారు. ఈ సందర్భంగా కుటుంబసభ్యులతో మంత్రి కేటీఆర్, ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ వారి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటాం అని భరోసా కల్పించారు

తెలంగాణ ఉద్యమ నేత, జెడ్పీచైర్మన్, బీఆర్ఎస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు కుసుమ జగదీష్ అంత్యక్రియలకు మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, సత్యవతి రాథోడ్, ఇతర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లు, నాయకులతో కలిసి రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరై భారత రాష్ట్ర సమితి జెండా ను కుసుమ జగదీష్ పార్థీవ దేహాము పై కప్పి ఘన నివాళి అర్పించి, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు..