mt_logo

సాయి చంద్ సతీమణి రజనీకి రాష్ట్ర వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పదవి

సాయి చంద్ సతీమణి రజనీకి రాష్ట్ర వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని ఇవ్వాలని ముఖ్యమంత్రి  నిర్ణయించారని  మంత్రి కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్‌ తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ యువ నాయకులు కుసుమ జగదీష్, వేద సాయి చంద్ అకాల మరణానికి సంతాపం మంత్రి కేటీఆర్ తెలిపారు.  ఉజ్వలమైన భవిష్యత్తు ఉన్న ఇద్దరు యువ నాయకులు అకాల మరణం చెందడం కేసీఆర్ ను ఎంతగానో కలచివేసిందని అన్నారు. కుసుమ జగదీష్, సాయి చందు తల్లిదండ్రులను కూడా పార్టీ తరఫున ఆదుకుంటామని హామీ ఇచ్చారు. సాయిచంద్ సతీమణి రజినీకి రాష్ట్ర వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని కూడా ఇవ్వాలని ముఖ్యమంత్రి  నిర్ణయించారని మంత్రి కేటీఆర్ తెలిపారు.  పార్టీ కార్యకర్తలకు ఎక్కడ ఇబ్బంది కలిగినా పార్టీ నాయకత్వం అండగా ఉంటుందని చెప్పారు. పార్టీ కార్యకర్తల శ్రమ, త్యాగాల వలన పార్టీ నిర్మాణమైందని గుర్తు చేసారు.