mt_logo

పల్లె ప్రగతితోనే ‘సంసద్ ఆదర్శ్ గ్రామీణ యోజన’ ర్యాంకులు సాధ్యమయ్యాయి : మంత్రి కేటీఆర్

రాష్ట్రంలో పల్లె ప్రగతి ప‌థ‌కం అమ‌లుతో తెలంగాణ గ్రామాలు దేశానికే ఆద‌ర్శంగా నిలుస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంస‌ద్ ఆద‌ర్శ్ గ్రామీణ యోజ‌న ర్యాంకుల్లో, టాప్ టెన్ ర్యాంకుల్లో తెలంగాణ ఏడు ర్యాంకుల‌ను కైవ‌సం చేసుకొని రికార్డు నెలకొల్పింది. దేశంలోని తొలి ఆద‌ర్శ గ్రామంగా ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్ జిల్లాలోని వెన్న‌పంల్లి గ్రామం నిలవగా, ఇదే జిల్లాలోని గన్నేరువరం నాలుగోస్థానం, వీర్నపల్లి ఆరోస్థానం, రామకృష్ణాపూర్ తొమ్మిదో స్థానంలో నిలిచాయి. అలాగే ఉమ్మ‌డి నిజామాబాద్ జిల్లాలోని కౌలాస్‌ప‌ల్లి రెండో స్థానంలో, కందకుర్తి ఐదో స్థానంలో, తానాకుర్డ్ పదోస్థానంలో నిలిచాయి. కాగా సంసద్ ఆదర్శ్ గ్రామీణ యోజన తొలి పది ర్యాంకుల్లో తెలంగాణ గ్రామాలు ఏకంగా ఏడు ర్యాంకులు పొందటం పట్ల రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నిజ‌మైన గ్రామీణాభివృద్ధి జ‌రుగుతోందని, సీఎం కేసీఆర్ ఆలోచనతో రూపుదిద్దుకున్న పల్లె ప్రగతి వల్లె ఇది సాధ్యమైంది అని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర పంచాయ‌తీరాజ్ శాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావుకు కేటీఆర్ అభినంద‌న‌లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *