mt_logo

రైతుబంధు రెండో రోజు రైతుల ఖాతాల్లోకి రూ.1278.60 కోట్లు

  • రెండో రోజు రూ.1278.60 కోట్లు
  • 16 లక్షల 98,957 మంది రైతుల ఖాతాలలో జమ
  • రెండు రోజులలో 39,54,138 మంది రైతుల ఖాతాలలో 1921.18 కోట్లు జమ
  • 38.42 లక్షల ఎకరాలకు రైతుబంధు

రైతు బంధు పంపిణీలో భాగంగా రెండో రోజైన మంగళవారం ఎకరం భూమి ఉన్న 16 లక్షల 98,957 మంది రైతుల ఖాతాల్లో రెండు రోజుల్లో 39,54,138 మంది రైతుల ఖాతాల్లో 1921.18 కోట్లు జమ చేయడం జరిగింది. 38.42 లక్షల ఎకరాలకు రైతుబంధు పథకం  కింద తెలంగాణ సర్కారు పెట్టుబడి సాయం అందించింది. ఈ మేరకు రూ. 1278.60 కోట్లు కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  రైతుబంధు పథకంతో తెలంగాణలో సాగువిప్లవం కొనసాగుతుంది. సాగునీటి రాక, ఉచిత కరంటుతో  సాగుకు యోగ్యమైన ప్రతి ఎకరా సాగులోకి వచ్చింది. వ్యవసాయ రంగం చుట్టూ అల్లుకున్న రంగాలు బలోపేతం అవుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ముందుచూపుతో వ్యవసాయానికి మొదటి ప్రాధాన్యం ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు.

ఆహారశుద్ధి పరిశ్రమలతో రూపు మారనున్న తెలంగాణ వ్యవసాయ రంగం, ఆరుగాలం కష్టపడే రైతు నాలుగు పైసల లాభం కండ్ల చూడాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్ష అని తెలిపారు. ఆ లక్ష్యంతోనే తెలంగాణ ప్రభుత్వం ముందుకుసాగుతున్నది. రైతుబంధు నిధులను సద్వినియోగం చేసుకోవాలని ఒక ప్రకటనలో రైతాంగానికి రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి విజ్ఞప్తి చేసారు.