mt_logo

తెలంగాణ‌పై ప‌గ‌బట్టిన కేంద్రం.. రీజిన‌ల్ రింగ్‌రోడ్డుకు కేంద్రం మోకాల‌డ్డు!

దేశంలోనే శ‌ర‌వేగంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణ‌పై కేంద్రంలోని బీజేపీ స‌ర్కారు అన్ని రంగాల్లోనూ వివ‌క్ష చూపుతున్న‌ది. తాజాగా, ఔట‌ర్ రీజిన‌ల్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్‌)కూ మోకాల‌డ్డుతున్న‌ది. ఓఆర్ఆర్ నిర్మాణం కోసం భూసేక‌ర‌ణ‌కు అయ్యే ఖ‌ర్చులో తెలంగాణ స‌ర్కారు సగం భరించాల‌ని ఇదివ‌ర‌కు చెప్పిన కేంద్రం.. రాష్ట్రంపై ఆర్థిక భారం మోపాల‌నే దురుద్దేశంతో ఇప్పుడు యుటిలిటీ షిఫ్టింగ్ నిధులు కూడా రాష్ట్ర‌మే భ‌రించాలంటూ కొత్త నిబంధ‌న‌ను తీసుకొచ్చింది. రూ.350 కోట్ల‌ను తెలంగాణ స‌ర్కారు భ‌రించాల్సిందేనంటూ తేల్చి చెప్పింది. లేకుంటే ఆ ప్రాజెక్టు ముందుకు సాగద‌ని స్ప‌ష్టం చేసింది. దీనిపై తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కేంద్రానికి అన్ని వివ‌రాల‌తో విన‌తిప‌త్రం ఇచ్చినా బీజేపీ స‌ర్కారు క‌నిక‌రం చూప‌లేదు. రూ. 350 కోట్లు చెల్లిస్తేనే ఓఆర్ఆర్ ప్రాజెక్టు ముందుకెళ్తుంద‌ని క‌ఠినంగా చెప్తున్న‌ది.

టోల్‌ట్యాక్స్ కావాల‌ట‌.. ఓఆర్ఆర్‌కు నిధులివ్వ‌ర‌ట‌ 

-తెలంగాణ‌లో భారత్‌మాలా పరియోజనలో భాగంగా  340 కిలోమీటర్ల పొడవైన నాలుగు లేన్ల రీజినల్‌ రింగ్‌ రోడ్డు సంగారెడ్డి, తూప్రాన్‌, చౌటుప్పల్‌, ఆమన్‌గల్‌, శంకరపల్లి తదితర పట్టణాల గుండా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 

-ఈ నిర్మాణానికిగానూ భూసేక‌ర‌ణ‌కు రూ.5,300 కోట్లు ఖ‌ర్చ‌వుతుంద‌ని కేంద్రం అంచ‌నా వేసింది. ఇందులో స‌గం తెలంగాణ స‌ర్కారు భ‌రిస్తేనే నిర్మాణం సాగుతుంద‌ని కండిష‌న్ పెట్టింది.

-ఈ మేర‌కు తెలంగాణ స‌ర్కారు ఈ ఏడాది బ‌డ్జెట్‌లో  ఓఆర్ఆర్ నిర్మాణం కోసం రూ. 500 కోట్లు కేటాయించింది. రూ.వంద కోట్ల‌ను విడుద‌ల చేసింది. 

-ఎలాగైనా తెలంగాణ స‌ర్కారును ఇబ్బందిపెట్టాల‌ని కంక‌ణం కట్టుకొన్న కేంద్రం ఇప్పుడు క‌రెంటు స్తంభాలు, టెలికం లైన్ల కోసం యుటిలిటీ షిఫ్టింగ్‌కు అయ్యే రూ.350 కోట్ల‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం చెల్లిస్తేనే ఓఆర్ఆర్ ప‌నులు ముందుకు క‌దులుతాయ‌ని నిబంధ‌న పెట్టింది. 

-కాగా, ఓఆర్ఆర్‌పై టోల్‌ట్యాక్స్ రూపంలో దండుకొంటున్న కేంద్రం రీజిన‌ల్ రింగ్‌రోడ్డుకు అడ్డుపుల్ల వేయ‌డంపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. టోల్‌ ట్యాక్స్‌తోపాటు పెట్రో సెస్‌ రూపంలో డ‌బ్బులు దండుకొంటున్న కేంద్ర‌మే ఈ మొత్తాన్నీ భరించాలని రాష్ట్ర ప్ర‌జ‌లు డిమాండ్ చేస్తున్నారు.