mt_logo

ఉచిత విద్యుత్ రద్దు చేస్తామన్న రేవంత్ ప్రకటనపై తెలంగాణ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు

తెలంగాణ రాష్ట్రంలో ఉచిత విద్యుత్తు అవసరం లేదంటూ టీపీసీసీ అధ్యక్షుడు అనుముల రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్.. మంత్రి కేటీఆర్ స్పందించారు. మీడియాకు విడుదల చేసిన ఓ ప్రకటనలో మంత్రి కేటీఆర్ స్పందిస్తూ  కాంగ్రెస్ పార్టీ వ్యవసాయ రైతు వ్యతిరేక ఆలోచన విధానానికి వ్యతిరేకంగా ఈరోజు మంగళవారం, రేపు బుధవారం  తెలంగాణ వ్యాప్తంగా నిరసనలకు భారత రాష్ట్ర సమితి తరపున  పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మల దహనానికి పిలుపునిచ్చారు కేటీఆర్. ఉచిత విద్యుత్ కార్యక్రమాన్ని రద్దు చేయాలన్న దుర్మార్గపు ఆలోచన కాంగ్రెస్ పార్టీది, గతంలో కూడా విద్యుత్ ఇవ్వకుండా రైతులను గోస పెట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. మరోసారి తన రైతు వ్యతిరేక విధానాలను కాంగ్రెస్ పార్టీ బయటపెట్టుకుంది, దీన్ని తెలంగాణ రైతాంగం తెలంగాణ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించాలన్నారు .