
రైతాంగానికి ఉచిత కరెంటు పై రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పు పట్టిన టీపీసీసీ అధ్యక్షుడు అనుముల రేవంత్ రెడ్డి. సన్న చిన్న కారు రైతులపై రేవంత్ రెడ్డి విద్వేషం చూపుతున్నారు. అమెరికా పర్యటనలో రేవంత్ రెడ్డి చేసిన రైతు వ్యతిరేక వ్యాఖ్యలపై తెలంగాణ సమాజం విస్మయం చెందుతుంది. ఇవాళ కరెంటు అక్కర లేదు అన్న రేవంత్ రెడ్డి రేపు అధికారంలోకొస్తే సాగునీళ్లు అక్కరలేదు, రైతుబంధు అక్కర లేదు, ఉచితాల పేరుతో ఏవి పేదలకు రైతులకు అక్కరలేదు, డబ్బు దుబారా..అనే ప్రమాదం ఉందంటున్న రాజకీయ విశ్లేషకులు.. ఇందుకు భయపడుతున్న సామాన్యులు, తెలంగాణకు ప్రమాదంగా దాపురించిన కాంగ్రెస్ పార్టీ వైఖరి, మొదటినుంచి కాంగ్రెస్ పార్టీది రైతాంగ వ్యతిరేక ధోరణి కావడం వల్లనే 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఒక్క రైతు అనుకూల కార్యక్రమం చేయలేదు, వ్యవసాయం చేసే రైతుల పట్ల దళిత బహుజనుల పట్ల మొదటి నుంచి కూడా ఇదే పెత్తందారి పోకడ. సన్న చిన్న కారు రైతులు అంటే కనీస మర్యాద లేని నాయకులు తెలంగాణ కాంగ్రెస్ లో ఉన్నారనడానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే అంటున్న రాజకీయ విశ్లేషకులు.