అధికారంలోకి రాకముందు తన కోసం పనిచేసిన మనుషులను వెంటపెట్టుకుని దావోస్ పర్యటనకు వెళ్లేందుకు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమయ్యారు. అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని ఒక జీవోను ప్రభుత్వ అధికారులు విడుదల చేశారు. రేవంత్‌తో పాటు దావోస్ పర్యటనకు ఓటుకు నోటు కేసు నిందితుడు ఉదయసింహా, డెక్కన్ క్రానికల్ పత్రిక ఎడిటర్ శ్రీరామ్ కర్రి వెళ్లనున్నారు.
అసలు సీఎం అధికారిక పర్యటనలో ప్రైవేట్ వ్యక్తులకు ఏం పని.. ప్రభుత్వ డబ్బుతో విదేశీ పర్యటనకు రేవంత్ తన మనుషులను ఎలా తీసుకెళ్తారని సోషల్ మీడియా వేదికగా ప్రజలు నిలదీస్తున్నారు. అధికారంలోకి రాకముందు ఈ ఇద్దరు రేవంత్ వెంట ఉండేవారు. అందులో మొదటి వ్యక్తి శ్రీరామ్ కర్రి డెక్కన్ క్రానికల్ ఎడిటర్‌గా చలామణి అవుతూ.. వివిధ రాజకీయ పార్టీలకు పొలిటికల్ కన్సల్టెంట్‌గాను సేవలు అందించేవాడని జోరుగా ప్రచారం ఉంది.
ప్రతీ రోజు తన పేపర్లో గత ప్రభుత్వం మీద బురద జల్లే వార్తలు రాస్తూ.. దుష్ప్రచారాన్ని నడిపించినందుకు ప్రతిఫలంగా రేవంత్ శ్రీరామ్‌ను తనవెంట దావోస్ పర్యటనకు మీడియా ప్రతినిధి రూపంలో తీసుకెళ్తున్నారు అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అసలు మీడియా ప్రతినిధికి దావోస్‌లో ఏం పని? ఒకవేళ మీడియాకి ప్రెస్ నోట్‌లు ఇవ్వడానికి వెంట తీసుకువెళ్ళాడని అనుకున్నా.. అవి చేయడానికి సీఎం పీఆర్వో అయోధ్యరెడ్డి ఉన్నారు కాని అతన్ని పక్కనపెట్టి మరి శ్రీరామ్ కర్రిని ఎందుకు తీసుకువెళ్తున్నట్లు? ఈ ప్రశ్నలు ఇప్పుడు జనాలు మదిలో తిరుగుతున్నాయి.
ఒకవేళ డెక్కన్ క్రానికల్ ఎడిటర్‌గా శ్రీరామ్‌ను రేవంత్ తీసుకువెళ్తే.. ఇతర పత్రికల ఎడిటర్లను ఎందుకు తీసుకువెళ్లటం లేదు? కేవలం శ్రీరామ్ కర్రిని తీసుకువెళ్లడంలో ఆంతర్యం ఏమిటి? ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాల్సి ఉంది.