
రంగారెడ్డి : భారీ వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు మంత్రి పట్నం మహేందర్ రెడ్డి. గత రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని.రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు మరియు గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి సూచించారు.
రంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాలలోని పాఠశాలలకు, కళాశాలలకు సెలవులను ప్రకటించిన నేపథ్యంలో.. అవసరమైతే తప్ప ప్రజలు బయటికి రారాదని అన్నారు. వాగులు, వంకలు నీటితో నిండి పొర్లుతున్నందునా రైతులు పొలాల్లోకి అవసరమైతే తప్ప వెళ్ళరాదన్నారు. కరెంటు స్తంభాలను, తీగలను ముట్టుకోవద్దని చెప్పారు.
జిల్లాల్లో కలెక్టర్ తో పాటు అధికారులందరూ స్థానికంగా ఉండి నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని మంత్రి మహేందర్ రెడ్డి ఆదేశించారు. వైరల్ ఫీవర్ బారిన పడకుండా అప్రమత్తంగా ఉండండని అన్నారు. ఇంటి పరిసరాల్లో దోమలు చేరకుండా ఉండేందుకు డ్రైనేజీ వాటర్ నిలవకుండా చూసుకోవాలని అన్నారు.