mt_logo

తెలంగాణలో మళ్లీ బీఆర్ఎస్ గెలవబోతుంది : రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్

సోమవారం రాజకీయ వ్యూహకర్త అయిన  ప్రశాంత్ కిషోర్ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 2023 అసెంబ్లీ, 2024 లోక్‌సభ ఎన్నికలపై తన అభిప్రాయాన్ని తెలిపారు. తెలంగాణలో బీఆర్‌ఎస్‌ పార్టీ పక్కా గెలుస్తుందని.. కేసీఆర్‌కు తిరుగులేదని స్పష్టం చేసారు. రానున్న రోజుల్లో 4 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య గట్టి పోటీ ఉంటుంది కానీ రెండు రాష్ట్రాల్లో బీజేపీ గెలిచే అవకాశం ఉందన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌ ఈజీగా గెలుస్తుందని అందరూ అనుకుంటున్నారు కానీ పోటీ ఉంటుంది. తెలంగాణలో మాత్రం ఏ మాత్రం పోటీ లేకుండా మళ్ళీ బీఆర్ఎస్ గెలుస్తుందన్నారు.