సంగారెడ్డి జిల్లా, పటాన్‌చెరు పట్టణంలోని నూతనంగా నిర్మించిన ఫ్రీడమ్ పార్క్, డిసిసిబి బ్యాంక్, ఆర్ అండ్ బీ గెస్ట్ హౌజ్, భవనాలను ప్రారంభించిన రాష్ట్ర ఆర్థిక, వైద్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సారథ్యంలో పటాన్ చెరు నియోజకవర్గం రూపురేఖలు మార్చేశారు. 10 కోట్ల రూపాయల అభివృద్ధి పనులను ప్రారంభించుకోవటం సంతోషదాయకం అన్నారు. ఫ్రీడం పార్క్,ఆర్ అండ్ బీ అతిథి గృహం, డీసీసీబీ బ్యాంక్, వార్డు కార్యాలయం వంటి అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసుకోవటంతో మంత్రి ఆనందాన్ని వ్యక్తం చేసారు. కాలుష్య కోరల్లో ఇబ్బంది పడుతుండే పటాన్ చెరు నేడు రోజురోజుకు అభివృద్ధి పథంలో దూసుకుపోతుందన్నారు.
ఐటీ సేవల విస్తరణకు పటాన్ చెరు కేంద్రం కాబోతుంది, ప్రతిపక్షాలు అధ్యక్షులను మార్చినా, ఔట్ డేటెడ్ లీడర్లకు పట్టం కట్టినా బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం తధ్యం అన్నారు. సంగారెడ్డికి మెడికల్ కళాశాల, పటాన్ చెరు కు 2వందల పడకల ఆసుపత్రి మంజూరు చేయటం ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి, కేంద్ర ప్రభుత్వం అడిగింది ఇవ్వకుండా, అసలు ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకుండా మోసం చేసిందని గుర్తు చేసారు.