mt_logo

రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావడం తధ్యం: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావడం తధ్యమని.. అరికెపూడి గాంధీ బీఆర్ఎస్‌లోనే ఉంటే దమ్ముంటే తెలంగాణ భవన్‌కు రావాలని భారీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సవాల్ విసిరారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడారు.

ఈ సందర్భంగా కేపీ వివేకానంద మాట్లాడుతూ.. దానం నాగేందర్‌తో పాటు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుపై నాలుగు వారాల్లో చర్యలు తీసుకోవాలని హైకోర్టు చెప్పింది. చర్యలు ప్రారంభించాలని అసెంబ్లీ సెక్రటరీకి హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది. కాలయాపన చేయకుండా చర్యలు ప్రారంభించాలని అసెంబ్లీ సెక్రటరీకి వినతిపత్రం ఇచ్చాం అని తెలిపారు.

పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకుండా టైంపాస్ చేసే విధంగా శ్రీధర్ బాబు మాట్లాడారు. అసెంబ్లీ గౌరవాన్ని కాపాడాలి అంటే ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలి. మిగతా ఏడుగురు ఎమ్మెల్యేలపై పిటీషన్ స్పీకర్ కార్యాలయంలో పెండింగ్‌లో ఉంది అని అన్నారు.

అసెంబ్లీ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబుపై మాకు గౌరవం ఉంది. శ్రీధర్ బాబు తన గౌరవాన్ని తగ్గించుకునే విధంగా మాట్లాడుతున్నారు. శ్రీధర్ బాబు మాటలు మాకు ఆశ్చర్యాన్ని కలిగించాయి అని అన్నారు.

సుప్రీంకోర్టు బెంచ్ ఎమ్మెల్యేల అనర్హతపై కాలయాపన వద్దని గతంలో తీర్పు ఇచ్చింది. హైకోర్టు తీర్పును శ్రీధర్ బాబు వక్రీకరిస్తున్నారు. హైకోర్టు తీర్పును శ్రీధర్ బాబు అగౌరవపరిచారు. ఎవరు పార్టీలోకి వచ్చినా చేర్చుకుంటామని శ్రీధర్ బాబు అంటున్నారు అని పేర్కొన్నారు.

పార్టీ మారితే వెంటనే అనర్హత వేటు వేయాలని దేశం మొత్తం రాహుల్ గాంధీ చెప్తున్నారు. పీఏసీ విషయంలో ఏ నిబంధనలు పాటించారో శ్రీధర్ బాబు చెప్పాలి. పీఏసీకి 14 మంది నామినేషన్ వేస్తే ఎన్నికలు జరగాలి కానీ పీఏసీకి దొంగచాటుగా అరికెపూడి గాంధీతో నామినేషన్ వేయించారు. మా పార్టీ నుండి పీఏసీకి ముగ్గురు నామినేషన్ వేశారు. నాలుగో పేరు మా పార్టీ తరపున ఎవరు ఇచ్చారో చెప్పాలి.. హరీష్ రావు వేసిన నామినేషన్ ఏమైందో చెప్పాలి అని అడిగారు.

అరికెపూడి గాంధీ ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారో ప్రజలకు చెప్పాలి.. హైకోర్టు తీర్పు తర్వాత బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు ఒక్కో రకంగా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను రేవంత్ రెడ్డి మోసం చేశారు. తడిబట్టలతో రేవంత్ రెడ్డి వారి గొంతు కోశారు అని దుయ్యబట్టారు.

గ్యారంటీలపై ప్రజలను మోసం చేసినట్టే రేవంత్ రెడ్డి పార్టీ మారిన ఎమ్మెల్యేలను మోసం చేశారు. ఫిరాయించిన వారు తిరిగి బీఆర్ఎస్‌లో చేరడానికి సిద్ధమైతే రేవంత్ రెడ్డి పోచారం ఇంట్లో హడావుడిగా విందు సమావేశం ఏర్పాటు చేశారు.. ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి పార్టీలో చేర్చుకున్నారు అని వివేకానంద విమర్శించారు.

ముందు కాంగ్రెస్‌లో చేరిన వారికే పదవులు అంటూ ఊరించారు.. పది మంది ఎమ్మెల్యేల భవిష్యత్‌కు రాజకీయ సమాధి కట్టారు. హైకోర్టు తీర్పు తర్వాత ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఆగమాగం అవుతున్నారు. రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావడం తధ్యం. పది ఎమ్మెల్యేల పరిస్థితి అయోమయంగా ఉంది ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్టు వారి పరిస్థితి తయారైంది అని వ్యాఖ్యానించారు.

ఎమ్మెల్యేలు వెనక్కి వస్తామని అంటే డిస్‌క్వాలిఫై చేయిస్తానని రేవంత్ రెడ్డి భయపెట్టారు. అసెంబ్లీ సెక్రటరీకి ఇచ్చిన పిటీషన్‌పై స్పీకర్ చర్యలు తీసుకోవాలి అని కోరారు.

పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికలు వస్తాయని తెలిసి పార్టీ మారిన ఎమ్మెల్యేలు గజగజ వణుకుతున్నారు పూటకో పార్టీ మారే దానం నాగేందర్ బిచ్చగాడు.. దానం నాగేందర్ చీటర్. దానం నాగేందర్ శాశ్వతంగా మాజీ ఎమ్మెల్యేగా మిగిలిపోతాడు అని జోస్యం పలికారు.

పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సిగ్గు, శరం లేదా.. రాజీనామా చేయండి అని సవాల్ విసిరారు. కడియం శ్రీహరి పచ్చి మోసగాడు.. కడియం శ్రీహరి స్టేషన్ ఘన్‌పూర్‌లో డిపాజిట్ తెచ్చుకోవాలి అని అన్నారు.

అరికెపూడి గాంధీ నేను కాంగ్రెస్ కండువా కప్పుకోలేదు అంటున్నారు.. దేవుడు కండువా కప్పుకున్నానని అంటున్నారు. కాంగ్రెస్‌లో చేరానని గాంధీయే స్వయంగా మీడియాకు చెప్పి ఇప్పుడు మాట మారుస్తున్నారు. పార్టీ మారిన వారు హైకోర్టు తీర్పు తర్వాత గజగజ వణుకుతున్నారు అని ఎద్దేవా చేశారు.

స్పీకర్ నిర్ణయం దాకా ఆగకుండా ఫిరాయించిన ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఉపఎన్నికలను ఎదుర్కోవాలి.. ఎప్పుడు ఎన్నికలు వచ్చిన ఆ పది సీట్లు బీఆర్ఎస్సే గెలుస్తుంది అని పేర్కొన్నారు.

అరికెపూడి గాంధీ నకిలీ గాంధీ.. గత పదేళ్లల్లో సింగిల్‌గా ఏ ఎమ్మెల్యేకు కండువా కప్పలేదు. కేసీఆర్ విడిగా కాంగ్రెస్ ఎమ్మెల్యేను చేర్చుకున్నారని నిరూపిస్తే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా కేసీఆర్ హయాంలో బీఆర్ఎస్ఎల్పీలో సీఎల్పీ విలీనం జరిగింది అని కౌశిక్ రెడ్డి గుర్తు చేశారు

వైఎస్ హయాంలో ఫిరాయింపులను ప్రారంభించింది కాంగ్రెస్ పార్టీ.. అరికెపూడి గాంధీ మా పార్టీ సభ్యుడు అయితే తెలంగాణ భవన్‌కు రావాలి అని అన్నారు.