కాంగ్రెస్ ప్రభుత్వం మాటలు కోటలు దాటుతున్నాయి కానీ ఆచరణ గడప దాటడం లేదు అని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. ఉద్యోగులకు 1వ తేదీనే జీతాలిస్తున్నామని ప్రచారం చేసుకుంటున్నది. కానీ వాస్తవం మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా ఉంది అని దుయ్యబట్టారు.
రాష్ట్రవ్యాప్తంగా గురుకులాల్లో పని చేస్తున్న ఐసీటీ కంప్యూటర్ టీచర్లకు మూడు నెలలుగా జీతాలు అందడం లేదు.. దీంతో వారు అప్పుల పాలయ్యి అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఆ కుటుంబాలు రోడ్డునపడుతున్నాయి అని పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి పెండింగ్ జీతాలను వెంటనే చెల్లించాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాము ఆని హరీష్ అన్నారు.