- చరిత్ర పుటల్లో నిలిచే గొప్ప విజయం సాధించింది తెలంగాణ
- రాష్ట్రంలో నిరుద్యోగాన్ని పెంచి పోషించిందే కాంగ్రెస్ పార్టీ
- తెలంగాణ యువత కలలు సాకారం చేసింది బీఆర్ఎస్ పార్టీ
నల్గొండ, మే 26: నల్గొండ జిల్లా మిర్యాలగూడా ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న మంత్రులు హరీశ్ రావు, జగదీష్ రెడ్డి. ఈ సందర్బంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు కొందరు. అభివృద్ధి అనే అస్త్రాన్ని ప్రయోగించాలి.విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణలో ఏం జరగకుండానే ఎందుకు అవార్డులు వచ్చాయి. పంచాయతీల్లో 38 శాతం అవార్డులు వచ్చాయి. మిషన్ భగీరథ, అటవీ అభివృద్ధి, విద్యుత్ శాఖ, వైద్య శాఖకు అవార్డులు వచ్చాయి, ఉన్న 10 జిల్లాల్లో 9 జిల్లాలు నాడు వెనుకబడ్డ జిల్లాలు అని ప్లానింగ్ కమిషన్ గుర్తించింది.33 జిల్లాల తెలంగాణ దేశానికి దిక్సూచిగా అయ్యింది.లక్షకు 22 సీట్లతో అత్యధిక ఎంబీబీఎస్ సీట్లతో దేశానికే నెంబర్ 1 గా ఉంది. తెలంగాణలో కాదు, కాంగ్రెస్ పార్టీలో పదవుల నిరుద్యోగం ఉందఅన్నారు.
రాష్ట్రంలో నిరుద్యోగాన్ని పెంచి పోషించిందే కాంగ్రెస్ పార్టీ
హిమాచల ప్రదేశ్ సీఎం ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు..వాస్తవాలు తెలుసుకోవాలి. హిమాచల్ ప్రదేశ్ నుండి ఎంతో మంది ఇక్కడికి వచ్చి బతుకుతున్నారు, నువ్వు మాకు నీతులు చెప్పకు, ఇక్కడ నేర్చుకొని వెళ్ళు.. కాంగ్రెస్సోళ్లు మాట్లాడుతూ తెలంగాణాలో ఉపాధిలేదు..ఉద్యోగాల్లేవు అంటున్నారు, కాంగ్రెస్ హయాంలో తెలంగాణలో ఉద్యోగాలు లేకనే కదా నియామకాల ట్యాగ్ లైన్ తో తెలంగాణ ఉద్యమం ప్రారంభం అయ్యింది. రాష్ట్రంలో నిరుద్యోగాన్ని పెంచి పోషించింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ యువత కలలు సాకారం చేసింది బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్,
విద్యార్థులను మభ్యపెట్టేందుకు, రాజకీయ అవసరాల కోసం మాత్రమే ఉమ్మడి ఏపీలో ఎపీపీఎస్సీ ద్వారా నోటిఫికేషన్లు ఇచ్చే వారు. అయినా అవి కూడా స్వల్పమే. 2004 నుంచి 2014 వరకు.. అంటే పదేళ్ల కాలంలో ఉమ్మడి ఏపీలో (23 జిల్లాలకు) ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేసిన ఉద్యోగాల సంఖ్య కేవలం 24,086. ఇందులో తెలంగాణ బిడ్డలకు కనీసం 6వేల ఉద్యోగాలు కూడా దక్కలేదన్నారు. కానీ తెలంగాణ యువత ఉద్యోగ కల నెరవేర్చాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ రాష్ట్ర ఏర్పాటు వెంటనే.. టీఎస్పీఎస్సీని ఏర్పాటు చేశారు.
10 జిల్లా తెలంగాణలో మొత్తంగా ఇప్పటి వరకు 1,32,899 ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేసింది. మరో 80 పోస్టులను భర్తీ చేస్తున్నది. ఉమ్మడి ఏపీలో అమల్లో ఉన్నప్పటి నాన్ లోకల్ విధానాన్ని రద్దు చేసి తెలంగాణ ప్రజలకే వంద శాతం ఉద్యోగాలు దక్కేలా చర్యలు చేపట్టింది. పాత జోనల్ వ్యవస్థ వల్ల స్థానికేతరులకు జిల్లా స్థాయిలో 20శాతం, జోనల్ స్థాయిలో 30శాతం, రాష్ట్ర స్థాయిలో 40 శాతం కోటా ఉండటంతో తెలంగాణ యువతకు అన్యాయం జరిగేలా అవకాశం ఉందని సీఎం కేసీఆర్ గ్రహించారు. 95 శాతం ఉద్యోగాలు తెలంగాణ యువతకు వచ్చేలా చేశారు.
చరిత్ర పుటల్లో నిలిచే గొప్ప విజయం సాధించింది తెలంగాణ
కాంగ్రెస్ నాయకులు అడ్డగోలుగా మాట్లాడుతారు, 40,50 సీట్లలో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు లేరు, మూడోసారి వచ్చేది ముమ్మాటికీ బీఆర్ఎస్ పార్టీనే.. డబుల్ ఇంజిన్ సర్కారు ఉన్న రాష్ట్రాల్లో లేని అభివృద్ధి సీఎం కేసీఆర్ గారి ఆధ్వర్యంలో జరిగింది. ఇదంతా గొప్పగా చెప్పాలి. తెలంగాణ పుట్టిన రోజు మనం 21 రోజులు చేసుకుంటున్నాం. అందరూ గొప్పగా నిర్వహించాలి, పాల్గొనాలన్నారు. జానారెడ్డి గారు నాడు 24 కరెంట్ ఇస్తే చమత్కారం అన్నారు, సీఎం గారు ఇచ్చి చూపారు. పరిపాలన రాదు అన్నారు, ఇప్పుడు పరిపాలనలో దేశమే శభాష్ అంటున్నది. ఉద్యమం అయినా, పరిపాలన అయినా మనం ఎంతో మందికి ఆదర్శం, చరిత్ర పుటల్లో నిలిచే గొప్ప విజయం సాధించింది తెలంగాణ.
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యమంత్రి వచ్చి మా రాష్ట్రపాలన తెలంగాణలో తెస్తామంటుండు, అంటే ఏంటి మీపాలన.. చాలి చాలని కరెంటు సరఫరా చేస్తారా? ప్రస్తుతం ఇస్తున్న రెండు వేల ఫించన్ ను రెండోందలకు తగ్గిస్తారా? కళ్యాణ లక్ష్మీ షాదీ ముబారక్ ను తీసేస్తారా? కేసీఆర్ కిట్లు అమ్మఒడి పథకాలను ఎత్తేస్తారా?రైతుబంధు రైతుబీమాలను రైతులకు దూరం చేస్తారా? రైతులకిస్తున్న సబ్సిడీ ఎరువులను ఎత్తేస్తారా? ఏంటి మీ కాంగ్రెస్ పాలన అంటే? ముమ్మాటికీ వచ్చేది బీఆర్ఎస్ పార్టీనే అన్నారు. పేదల కోసం ఎందుకు ఒక్క మెడికల్ కాలేజీ తేలేదు, నల్లగొండలో బత్తాయి మార్కెట్ తెచ్చాము. ఆసుపత్రుల్లో 60 ఏళ్లలో 17 వేల పడకలు, 50 వేల పడకలు తెచ్చుకున్నామన్నారు.