mt_logo

నల్గొండ జిల్లాలో వృద్ధ జంబుకాలు గాండ్రిస్తున్నాయి : మంత్రి జగదీష్ రెడ్డి

నల్గొండ, మే 26: నల్గొండ జిల్లా మిర్యాలగూడా ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న మంత్రులు హరీశ్ రావు, జగదీష్ రెడ్డి.ఈ సందర్బంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ గారు మొదటి నుండి నమ్మి ఆచరించే సిద్దాంతం.. అభివృద్ధి, ఎన్నికలు వచ్చినపుడు మాత్రమే రాజకీయాలు చేయాలి అన్నారు. ఎమ్మెల్యే భాస్కర్ రావు గారు ఆధ్వర్యంలో నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందింది. సీఎం కేసీఆర్ గారు తండ్రిగా ఆలోచించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారు. తెలంగాణ రాకముందు ఆకలి చావులు, ఆత్మహత్యలు ఉండేవి, ఇప్పుడు అవి లేకుండా చేశారు కేసీఆర్, డబుల్ ఇంజిన్ సర్కారు ఉన్న రాష్ట్రాల్లో తినడానికి తిండి కూడా లేదు, కేసీఆర్ పుణ్యాన పదవి వచ్చిన వాళ్ళు, అడ్రస్ వచ్చిన వాళ్ళు.. నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు.

పీసీసీ చీఫ్ పదవి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎలా వచ్చారు. కేసీఆర్ దయవల్లనే ఆ పదవులు వచ్చాయి. వారికి అవకాశం వచ్చింది. 12 కు 12 ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ గెలిచింది. చరిత్రలో ఎన్నడూ జరగలేదు. నల్గొండ జిల్లాలో వృద్ద జంబుకాలు గాండ్రిస్తున్నాయి. అడుగు తీసి అడుగు వేయవు. జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డిల వల్ల ఫ్లోరిన్, కరువు మాత్రం జిల్లాలో అభివృద్ధి అయ్యాయి.రాజవరం పొలాలే జానారెడ్డిని ఓడించాయి. అధికారంలోకి వస్తేనే యాదద్రి పవర్ ప్లాంట్ బంద్ చేస్తా అన్నారు. అభివృద్ధి నిరోధకులు ఉన్నారు. నల్గొండ జిల్లా ప్రజలు ఎంతో చైతన్యవంతులన్నారు. నల్గొండ జిల్లా కేసీఆర్ ఖిల్లా అయ్యిందన్నారు.