mt_logo

లగడపాటిపై జాతీయ పార్టీల ఎంపీల ఫైర్!

అత్యంత ప్రతిష్టాత్మకమైన పార్లమెంటు చరిత్రలో నిన్న జరిగిన సంఘటన చీకటి రోజుగా నిలిచిపోనుంది. సీమాంధ్రుల దురహంకారం ఎంతటికైనా దారితీస్తుందని దేశమంతా అర్థమైంది. సీమాంధ్ర ఎంపీ లగడపాటి, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి పెప్పర్ స్ప్రే, కత్తితో పార్లమెంటులో ప్రవేశించడాన్ని జాతీయ పార్టీలకు చెందిన కొందరు ఎంపీలు తీవ్రంగా తప్పుపట్టారు. స్పీకర్, మరికొందరు సభ్యులు, ఎంపీలపై లగడపాటి పెప్పర్ స్ప్రే చల్లడంపై వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ నేత జస్వంత్ సింగ్ మాట్లాడుతూ, లోక్ సభలో ఇంతవరకూ ఇలాంటి సంఘటన నేనెప్పుడూ చూడలేదు. దీనికంతా ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఇది అత్యంత అవమానకరమని, క్షమించరాని నేరమని ఆయన అన్నారు. బీజేపీకి చెందిన మరో సభ్యురాలు సుమిత్రా మహాజన్ ప్రభుత్వమే ఈ ఘటనకు పూర్తి బాధ్యత వహించాలని చెప్పారు. జేడీయూ నేత శరద్ యాదవ్ కూడా తీవ్రస్థాయిలో లగడపాటి, మరికొందరు బాధ్యులపై ధ్వజమెత్తారు. ద్రోహపూరిత చర్యగా పెప్పర్ స్ప్రే ఘటనను తూలనాడుతూ, దీనికి కారణమైనవారిని ఉపేక్షించరాదని, కఠినంగా శిక్షించాల్సిందే అని వ్యాఖ్యానించారు. ఎంపీలను రక్షించేందుకు తాను అక్కడికి వెళ్ళినప్పుడు పెప్పర్ స్ప్రే ఘటన జరిగిందని, అక్కడే నిలబడి ఉన్నానని, స్పీకర్ మీరాకుమార్ కు, సెక్రటరీ జనరల్ కు ఏమవుతుందోనని ఆందోళన చెందానని శరద్ యాదవ్ స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *