mt_logo

తెలంగాణపై ఆందోళన వద్దు-కేసీఆర్

గురువారం పార్లమెంటులో తెలంగాణ బిల్లు కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే ప్రవేశపెట్టారని స్పీకర్ మీరాకుమార్ చెప్పగానే సీమాంధ్ర ఎంపీలు వికృత చేష్టలకు పాల్పడిన సంగతి తెలిసిందే. సీమాంధ్రుల పైశాచిక దాడి చూసి యావత్ ప్రపంచం విస్తుపోయింది. ఈ ఘటనపై టీఆర్ఎస్ అధినేత కే.చంద్రశేఖర్ రావు గురువారం తెలంగాణ ప్రజలనుద్దేశించి మాట్లాడారు. తెలంగాణ బిల్లును అడ్డుకోవడానికి సీమాంధ్ర నేతలు పార్లమెంటులో ప్రవర్తించిన తీరును చూసి దేశం మొత్తం సిగ్గుపడుతుందని, ఇలాంటి వెకిలి చేష్టలు చూసి తెలంగాణ ప్రజలు ఆందోళన పడొద్దని అన్నారు. సీమాంధ్ర నేతల సిగ్గుమాలిన చర్యలను చూసి ప్రతిఒక్కరూ ఛీ కొడుతున్నారని తెలిపారు. తప్పకుండా తెలంగాణ వచ్చి తీరుతుందని, పార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టారని స్పష్టం చేశారు. బిల్లు పాసవ్వగానే తెలంగాణ అంతటా సంబరాలు చేసుకుందామని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజలు సీమాంధ్ర నాయకుల పాలనను ఎందుకు వద్దంటున్నారో ఈ రోజు సంఘటన చూసాక ప్రపంచం అంతటా తెలిసిందన్నారు. పార్లమెంటు సెంట్రల్ హాల్ కు వెళ్ళినప్పుడు జాతీయనేతలు సీమాంధ్ర నేతల అసలు సంగతి ఇప్పుడు తెలిసిందని అన్నారని, మీరెందుకు ప్రత్యేక రాష్ట్రం కోరుకుంటున్నారో, సీమాంధ్ర పాలకులనుండి ఎందుకు దూరంగా పారిపోవాలనుకుంటున్నారో అర్థమైందని అంటున్నారని కేసీఆర్ మీడియా సమావేశంలో చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *