mt_logo

నాగం జనార్దన్ రెడ్డి చేరికతో బలం పెరిగింది: సీఎం కేసీఆర్

తెలంగాణ భవన్‌లో సీఎం కేసీఆర్ సమక్షంలో బీ ఆర్ ఎస్ లో చేరిన మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి ,మాజీ ఎమ్మెల్యే విష్ణు వర్ధన్ రెడ్డి , కొల్లాపూర్ నేత రాంపుల్లా రెడ్డి, కరీంనగర్ కాంగ్రెస్ నేత కొత్త జైపాల్ రెడ్డి తదితర నేతలు. గులాబీ కండువాలు కప్పి సాదరంగా కేసీఆర్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. పార్టీలో చేరిన మిత్రులందరికీ స్వాగతం తెలిపారు. నాగం జనార్దన్ రెడ్డి 1969 తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా ఉన్నారు ..ఆ తర్వాత ఉద్యమంలో పాల్గొన్నారని గుర్తు చేసారు. జైలుకు వెళ్లిన చరిత్ర నాగం ది అని తెలిపారు. నాగం చేరికతో బలం పెరిగిందన్నారు.  

పాలమూరులో పద్నాలుగుకు పద్నాలుగు సీట్లు గెలవడం ఖాయం అయ్యిందని స్పష్టం చేసారు. విష్ణువర్ధన్ రెడ్డి మంచి రాజకీయ భవిష్యత్‌కు భాద్యత నాదని చెప్పారు. పీజేఆర్ నాకు మంచి మిత్రుడు ఆయన కుమారుడు  విష్ణు నా కుటుంబ సభ్యుడి లాంటి వాడే అన్నారు. ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్, విష్ణు పాత కొత్త అనే తేడా లేకుండా సమన్వయంతో పని చేసుకోవాలని సూచించారు. నాగం ఇంటికి త్వరలో నేనే స్వయంగా వెళ్లి మరోసారి ఆయన వెంట వచ్చిన కార్యకర్తలను కలుసుకుంటా అని అన్నారు. 

తెలంగాణ బ్రహ్మాండమైన పురోగతితో ముందుకు సాగుతోందని తెలిపారు. తలసరి ఆదాయం పెరిగింది ..24 గంటల కరెంటు దేశంలో మరెక్కడా లేదని తేల్చి చెప్పారు. అభివృద్ధిని చూసి ఓర్వలేకే ప్రతిపక్షాలు నీచ రాజకీయాలు చేస్తున్నాయి. నిన్న ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డిని చంపాలని చూశారు, దేవుడి దయ వల్ల  ప్రభాకర్ రెడ్డి బ్రతికి బయట పడ్డాడు. ఇలాంటి హత్య రాజకీయాలు సహించేది లేదని హెచ్చరించారు. హింసాత్మక చర్యలు ఎవరు చేసినా ఉపేక్షించం చమని తేల్చి చెప్పారు. హేయమైన దాడులకు ఈ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పుదాం అని అన్నారు.