నిజామాబాద్ జిల్లా మోతె గ్రామంలో ముడుపువిప్పిన తర్వాత టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గ్రామ ప్రజలనుద్దేశించి ఉద్వేగభరితంగా ప్రసంగించారు. ‘’తెలంగాణ రాష్రం సాధించుకుని రా! అని నాకు బొట్లు పెట్టి దీవెనలు అందించిన మోతె గ్రామ అమ్మలకు, అక్కలకు కృతజ్ఞతలు చెబ్తున్నానని, తెలంగాణ పోరాటంలో భయమైన ప్రతీసారి మోతె మూటను చూసుకుని ధైర్యంగా ముందుకు నడిచానని” అన్నారు. పోరాటంలో బలమైన శత్రువున్నప్పటికీ ముందుకు నడిపింది మోతె గడ్డ అని, మోతె గ్రామం కేసీఆర్ గుండెల్లో ఉందని అన్నారు. ముత్యం వంటి మోతె గ్రామానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని, ఇక్కడి గ్రామస్తులు కొండంత అండనిచ్చారని తెలిపారు. వందశాతం నీళ్ళు తెచ్చి గ్రామాన్ని సస్యశ్యామలం చేస్తామని, పసుపు పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఎర్రజొన్న బకాయిలను కూడా ఇప్పిస్తానని భరోసా ఇచ్చారు.