mt_logo

ఉద్యమకాలంలో పిడికిలెత్తిన ‘మిషన్‌ తెలంగాణ’.. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ‘జనం సాక్షి’ ప్రత్యేక కథనం

అతడు..అబద్ధం అంతుచూసే అంకుశం…! నిజాన్ని నిలబెట్టే నిట్టాడు!
కట్టుకథల గుట్టురట్టు చేసే పట్టు వదలని సత్యశోధకుడు..!
గోబెల్స్‌ ప్రచారాలకు గోరీకట్టి.. సామాజిక మాధ్యమాల్లో తెలంగాణ ఘనతను సమర్థంగా చాటిచెప్పే సారథి..! తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా మిషన్ తెలంగాణ వెబ్‌సైట్ వ్యవస్థాపకుడు కొణతం దిలీప్‌ (తెలంగాణ డిజిటల్‌ మీడియా డైరెక్టర్‌) గురించి ‘జనం సాక్షి’ వారు రాసిన ప్రత్యేక కథనం.


మిషన్‌ తెలంగాణ…ఉద్యమ సందర్భంలో మార్మోగిన వెబ్‌సైట్‌..! సీమాంధ్ర మీడియా వండివార్చిన తప్పుడు వార్తలను తిప్పికొట్టి ..విద్యార్థులను ఆత్మహత్యలకు పురిగొల్పుతున్న దుష్ప్రచారాలను వీరోచితంగా ప్రతిఘటించిన ఆ విలువైన వేదికను సృష్టించింది కొణతం దిలీపే..! మీడియాలోకంలో తెలంగాణకు సొంత గొంతుకలు లేని ఆ రోజుల్లో… పరిమిత వనరులతోనే చరిత్రను తవ్వి..వాస్తవాలను వెలికితీసి..పోరాట వార్తల్ని దేశపొలిమేరల అవతలకూడా వ్యాపింపజేసిన కృషి నిజంగా అమూల్యం.

గూగుల్‌ సంస్థలో ఉద్యోగం చేస్తూనే ఉద్యమంలో ప్రభావవంతమైన పాత్ర పోషించిన విద్యావంతుడు కొణతం దిలీప్‌.. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు ముద్దుబిడ్డ. ఆయన భావాలు ప్రగతిశీలం..!రచనలు సృజనశీలం..! కొణతం దిలీప్‌ మంచి రచయిత..అనువాదకుడు..! అగ్రరాజ్య ఆర్థిక పన్నాగాలను బట్టబయలు చేసిన ఎకనామిక్‌ హిట్‌మేన్‌ పుస్తకాన్ని .. ఒక దళారీ పశ్చాత్తాపం పేరుతో తెలుగులోకి తెస్తే అది సంచలన విజయం సాధించింది..! కుట్రాజకీయం.. జంగల్‌నామా.. ఏ రిబట్టల్‌ టూ విశాలాంధ్ర గోబెల్స్‌ ప్రాపగాండా.. ఫ్యూచర్‌ పర్‌ఫెక్ట్‌ కేటీఆర్‌… ఇతర ముఖ్య రచనలు.

తెలంగాణ ఆవిర్భావం తర్వాత.. కొణతం దిలీప్‌ను డిజిటల్‌ మీడియా డైరెక్టర్‌గా నియమించింది ప్రభుత్వం..! రాష్ట్రం సాధించిన అద్భుత విజయాలను సోషల్‌ విూడియా వేదికలపై ప్రచారం చేయడంలో సఫలమైంది డిజిటల్‌ వింగ్‌..! అంతేకాదు…నిత్యం ఫాక్ట్‌ చెకింగ్‌ చేస్తూ నకిలీ వార్తల నడ్డివిరగొడుతున్నారు..! అబద్ధాలను.. అసత్యాలను పొగేసి రాసే కల్పిత కథనాలకు నిజాలతో నిప్పుపెట్టి తగలబెడు తున్నారు..! పచ్చి అబద్ధాలైనా సరే ప్రచారం చేయండని చెప్పిన అమిత్‌ షా పార్టీ..కుద్ర విద్యల ఐటీసెల్‌ చేసే వికృత ప్రాపగం డాను చీల్చిచెండాడుతు న్నారు..! వాట్సప్‌ యూనివర్శిటీ ఫేక్‌ రాతగాళ్లకు కొణతం దిలీప్‌ అంటే వణుకు..! అబద్ధం బట్టలువిప్పి నిజం ఎదుట నగ్నంగా నిలబెడు తున్న మొనగాడు ఆయన.

డిజిటల్‌ ప్రచార..ప్రసార రంగంలో ఆయన చేసిన కృషికి మెచ్చి ఎన్నోఅవార్డులు వరించాయి..! కోవిడ్‌ సమయంలో సాగించిన కమ్యూనికేషన్‌ కి గుర్తింపుగా డిజిటల్‌ మీడియా వింగ్‌కు పబ్లిక్‌ రిలేషన్స్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా పురస్కారం దక్కింది. 2021లో పీసీఆర్‌ఐ చాణక్య అవార్డు అందుకున్నారు కొణతం దిలీప్‌..!