mt_logo

బీసీ కుల వృత్తుల వారికి రూ. లక్ష ప్రభుత్వ సాయంపై మరికొన్ని మార్గదర్శకాలు

రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రైతుబంధు, రైతుభీమా, రైతు భరోసా వంటి పథకాల రూపంలో ఆర్దిక సాయం అందజేస్తోంది. తాజాగా బీసీలు, వెనుకబడిన వర్గాల వారికి లక్ష రూపాయల ఆర్ధిక సాయం అందించేందుకు ఈ స్కీమ్‌ని ప్రవేశపెడుతోంది. ఈ పథకంలో  భాగంగానే వెనుకబడిన సామాజికవర్గాల్లోని చేతి వృత్తులు, కులవృత్తులు నిర్వహించే మేదరి, కమ్మరి, రజక, నాయి బ్రాహ్మణ, విశ్వ బ్రాహ్మణలకు లక్ష రూపాయల ఆర్ధిక సాయం అందజేయనుంది. బీసీ కులవృత్తుల వారికి లక్ష రూపాయల ప్రభుత్వ సాయంపై మరికొన్ని మార్గదర్శకాలు తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు కూడా పథకం వర్తింపు.. దరఖాస్తు చేసుకునేందుకు  సమయం తక్కువగా ఉన్నందున ఆదాయ(ఇన్ కం) సర్టిఫికెట్లు  విషయంలో కొంత వెసులుబాటు కల్పించిన ప్రభుత్వం..(రెండు సంవత్సరాల ముందు) ఏప్రిల్ 1  2021 తరువాత ఆదాయపు సర్టిఫికెట్ తీసుకున్న వాళ్ళు..  ఆ సర్టిఫికెట్ తోనే పథకానికి అప్లై చేసుకోవచ్చు..ఈ పథకానికి అర్హులైన 15 కులాల వివరాలను కూడా తెలియజేశారు.