ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సచివాలయంలో వాటర్ గ్రిడ్, మిషన్ కాకతీయపై సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. వీటికి సంబంధించిన పనులపై సీఎం అధికారులను అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా వాటర్ గ్రిడ్ పనులకు సంబంధించిన టెండర్లపై చర్చలు జరిపినట్లు, ఈ నెలాఖరులో టెండర్లకు పిలిచే అవకాశం ఉన్నట్లు తెలిసింది.
ఇదిలాఉండగా వరంగల్ మున్సిపల్ అధికారులతో సచివాలయంలో సీఎం కేసీఆర్ సమీక్ష జరిపారు. వరంగల్ పట్టణాభివృద్ధికి సంబంధించిన అంశాలపై చర్చించిన అనంతరం వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పేరు మార్చాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ గా పేరు మార్చాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.