mt_logo

మూడు వ్యవసాయ గోదాములు ప్రారంభించిన మంత్రులు పువ్వాడ, నిరంజన్ రెడ్డి.

ఖమ్మం నియోజకవర్గం రఘునాధపాలెం మండలం జింకల తండా వద్ద రూ.14.90 కోట్లతో నూతనంగా నిర్మించిన 20 వేల మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం గల మూడు గోదాములను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు.

అనంతరం మంత్రి పువ్వాడ మాట్లడుతూ.. నాటి ఉమ్మడి రాష్ట్రంలో పండించిన పంటను రైతులు దాచుకునే వెసులుబాటు లో లేకుండా పోయిందని, దానికి శాశ్వత పరిష్కారం చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఅర్ ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు. ఖమ్మం జిల్లా వైవిద్యమైన వ్యవసాయం చేయడంలో ఖమ్మం జిల్లా ముందుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఅర్ ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్, ఎరువులు, విత్తనాలు సరఫరాతో ఖమ్మం జిల్లాలో ప్రతి పంటను రైతులు స్వేచ్చగా పండిస్తున్నారని, ప్రతి ఏడాది ఆయా పంటల దిగిమతి సంఖ్య గణనీయంగా పెరిగిపోతుందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయం చెయ్యాలంటే విద్యుత్ ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో ఆయా అధికారులకే తెలియకుండా ఉండేదని, కానీ నేడు సీఎం కేసీఆర్ నాయకత్వంలో నిరంతర ఉచిత విద్యుత్ ను అందిస్తూ వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. 

మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, సీఎం కేసీఆర్ నేతృత్వంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా బీడు భూములన్ని పచ్చరంగు పులుముకున్నాయన్నారు. రైతును రాజు చేయాలనే ఉద్దేశ్యంతో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో రైతులకు ఉచిత విద్యుత్, రైతు బంధు, రైతు బీమా, చెక్ డ్యాముల నిర్మాణం, మినీ లిఫ్టులతో మిర్రు ప్రాంతాలకు సాగునీరును అందిస్తున్నామన్నారు. ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని రైతుల సంక్షేమం పట్ల తెలంగాణ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. రైతులు మార్కెట్ లో డిమాండ్ ఉన్న పంటలను పండించడం ద్వారా లాభసాటి వ్యవసాయం చేయాలని అన్నారు. సాగునీరు అందించడంతో రైతులు, గ్రామస్తులు వ్యవసాయ పనులలో నిమగ్నమై గ్రామంలో సమావేశాలకు, సభలకు వచ్చే పరిస్థితి లేదన్నారు. మానవ జీవన మనుగడకు నీరే మూలాధారమని.. నీటిని ఓడిసిపట్టే పనులకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *