mt_logo

నిరంతరంగా కొనసాగుతున్న బీసీ బంధు ఆర్థిక సాయం

ప్రతి నెల నియోజకవర్గానికి 300 మందికి చొప్పున అందజేత

నిజామాబాద్: బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్ మండల కేంద్రంలో నియోజకవర్గ బీసీ కులవృత్తులలో అర్హులైన లబ్ధిదారులకు లక్ష రూపాయల ఆర్థిక సహాయం చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయనటువంటి మంచి పనులు పేదలకోసం సీఎం కేసీఆర్ చేస్తున్నారు.

కోడి గుడ్డు మీద ఈకలు పీకుతున్న బీజేపీ ,కాంగ్రెస్

సమాజంలో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలి.ఎవరు ఆకలితో అలమటించే కూడదని పనిచేసే గొప్ప వ్యక్తి కేసీఆర్. బీజేపీ ,కాంగ్రెస్ వాళ్లకు ఎన్ని మంచి పనులు చేసిన కనబడదన్నారు.  కోడి గుడ్డు మీద ఈకలు పీకినట్లు వ్యవహరిస్తారు..వారికి ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు కనబడుతది అని అన్నారు.  గతం లో ఏ ప్రభుత్వం లో కూడా బీడీ పెన్షన్ లు ఇవ్వలేదు. ఎన్ని కష్టాలు వచ్చిన పెన్షన్ మాత్రం టంచన్ గా ఇస్తున్నామని తెలిపారు. 

విద్య, వైద్యం బలహీన వర్గాలకు ఆర్థిక సహాయం

పేద ఆడబిడ్డల కోసం కల్యాణ లక్ష్మి ఇస్తున్నాం..ఈ పథకం కూడా గతంలో లేకుండే.. వేల కోట్ల రూపాయల ఖర్చుతో ప్రభుత్వ ఆసుపత్రులను కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా తయారు చేసామన్నారు. కేసీఆర్ కిట్టు పథకం ఒక మానవీయ కోణం ద్వారా వచ్చిన గొప్ప పథకం. సంపద సృష్టించి పేదలకు పంచాలి అనేది సీఎం కేసీఆర్ సంకల్పం. సాగు నీరు,ఉచిత కరెంట్, తాగునీటి కోసం లక్షల కోట్లు ఖర్చు చేసి ప్రజలకు అందిస్తున్నామని తెలిపారు. విద్య, వైద్యం బలహీన వర్గాలకు ఆర్థిక సహాయం అందించడం ఈ మూడు అంశాలపైనే మా దృష్టి అని అన్నారు. 

ఆ దిశగా ఇప్పటికే పనులు జరుగుతున్నాయని తెలిపారు.  బీసీలకు చేసే ఆర్థిక సహాయం నిరంతరంగా కొనసాగుతుంది.  ప్రతి నెల నియోజకవర్గానికి 300 చొప్పున అందిస్తామన్నారు.  ప్రజల ఆశీర్వాదంతో మూడోసారి కూడా కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారు. ఏది ఏమైనా కేసీఆరే తెలంగాణ ప్రజలకు శ్రీరామ రక్ష అని పేర్కొన్నారు.