mt_logo

 ‘మెగా జాబ్ మేళా’ ను ప్రారంభించిన మంత్రి  శ్రీనివాస్ గౌడ్ 

హైదరాబాద్, మే 22:  రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు, యువజన సర్వీసుల శాఖల మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ లోని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యువజన సర్వీసుల శాఖల, TS STEP ల ఆధ్వర్యంలో 118 కంపెనీ లలో సుమారు 10 వేల మంది నిరుద్యోగులకు  ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంతో ‘మెగా జాబ్ మేళా’ ను స్థానిక శాసనసభ్యులు KP వివేకానంద్ గారితో కలిసి  ప్రారంభించారు. రాష్ట్ర మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ కుత్బుల్లాపూర్ లో నిర్వహించిన ‘మెగా జాబ్ మేళా’ లో పాల్గొని ఉద్యోగాలు సాధించిన వారికీ నియామకాల పత్రాలను స్ధానిక ఎమ్మెల్యే వివేకానంద్ గారితో కలిసి అందించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ … సీఎం కేసీఆర్ గారి ఆదేశాల మేరకు తెలంగాణ యువజన సర్వీసుల శాఖ – TS STEP ల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 18 జాబ్ మేళాలు నిర్వహించడం జరిగిందన్నారు. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్  కృషితో ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు ఉన్న కంపెనీలు హైదరాబాద్ లో స్థాపించడానికి ముందుకు వస్తున్నాయన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం అనుసరిస్తున్న పారిశ్రామిక విధానాల వల్ల నేడు ఇండస్ట్రియల్ హబ్ గా తెలంగాణ రాష్ట్రం గుర్తింపు లభిస్తుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న  ప్రతి జాబ్ మేళా లో 30 నుండి 80 కంపెనీలు వివిధ రంగాల్లో సాఫ్ట్వేర్, Bpo, ఫార్మా, రిటైల్, రియల్ ఎస్టేట్ రంగాల్లో నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగాలను వారి అర్హతల తగ్గట్లు ఉద్యోగాలు కల్పించామన్నారు. 

18 జాబ్ మేళాలో 97 వేల 19 మంది నిరుద్యోగ యువతీ యువకులు TS STEP కు దరఖాస్తులు చేసుకున్నారన్నారు. వారిని ఇంటర్వ్యూల ద్వారా గుర్తించి 30 వేల 902 మంది కి వివిధ సంస్థలలో ఉద్యోగాలను కల్పించి నియామక పత్రాలు అందించామన్నారు. వివిధ సంస్థలలో ఉద్యోగాలు సాధించిన వారికి కనిష్టంగా నెలకు 10వేల రూపాయలు నుండి గరిష్టంగా 80 వేల రూపాయల వేతనాలను ఎంపిక చేసుకున్న వివిధ సంస్థలు వేతనాలు  అందిస్తున్నాయన్నారు. అలాగే, హైదరాబాద్ లో త్వరలో 50 వేల మందికి ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంతో మెగా జాబ్ మేళాను నిర్వహించబోతున్నామన్నారు.   రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో జాబ్ మేళాలను నిర్వహించి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు, ఉపాధిని కల్పించాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ గారి ఆదేశాల మేరకు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు రాష్ట్ర మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్.