వరంగల్ కు చెందిన కాకతీయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నలాజికల్ సైన్సెస్ (KITS), బృందం అభివృద్ధి చేసిన డ్రైవర్‌లెస్ అటానమస్ ట్రాక్టర్‌ను డెవలప్ చేసి ఎంతో ఆకట్టుకున్నారని మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. డ్రైవర్ లేకుండానే ఆ ట్రాక్టర్ భూమిని దున్నేస్తోంది. ఇది వ్యవసాయం యొక్క భవిష్యత్తు & సామాజిక ప్రభావాన్ని చూపాలనుకునే యువ ఆవిష్కర్తలు ఇలాంటి మరిన్ని ఆలోచనలు & ఉత్పత్తులతో బయటకు రావాలని నేను కోరుతున్నానని మంత్రి అన్నారు. సామాజిక మేలు కోసం ఆవిష్కరణలు చేపట్టాలని ఆయన ఆకాంక్షించారు.