ప్రజా గాయకుడు గద్దర్ మరణం పట్ల బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. తన గళంతో కోట్ల మంది ప్రజలను గద్దర్ ఉత్తేజపరిచారని, ఆయన మరణం బాధాకరమని అన్నారు. కవిగా, గాయకుడిగా తన ఆట, పాటలతో లక్షలాది మంది అభిమానాన్ని చూరగొన్నారని, ప్రజలలను చైతన్యవంతులను చేశారన్నారు. గద్దర్ కుటుంబ సభ్యులకు మంత్రి కేటీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.