వీరుడు ఎక్కడ పుట్టినా వీరుడే అని అల్లూరి సీతారామరాజును ఉద్దేశించి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. అల్లూరి సీతారామ రాజుని గుర్తుచేసుకోవడం ప్రతి భారతీయ పౌరుడి విధి అని స్పష్టం చేశారు. అల్లూరి సీతారామా రాజు 125వ జయంతి సందర్భంగా ట్యాంక్‌బండ్‌పై నిర్వహించిన వేడులకు మంత్రులు శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో కలిసి కేటీఆర్ హాజరయ్యారు. అల్లూరి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. అందరికి అల్లూరి సీతారామరాజు గారి 125వ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. మన్యం వీరుడి జయంతి వేడుకలను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నదని చెప్పారు.