యాదాద్రి, జూన్ 6: యాదాద్రి భువనగిరి జిల్లా దండు మల్కాపూర్‌లో తెలంగాణ టాయ్స్ పార్క్‌కు మంత్రులు కే టి రామారావు, జగదీష్‌రెడ్డి తో కలిసి శంకుస్థాపన చేశారు. మృదువైన బొమ్మలు, ఎలక్ట్రానిక్, ప్లాస్టిక్, నాన్ టాక్సిక్, సిలికాన్ బొమ్మలు దీని ద్వారా లభించనున్నాయి. తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ద్వారా అభివృద్ధి చేయబడిన ఈ టాయ్ పార్క్ ముఖ్యంగా గ్రామీణ యువత, స్థానికంగా నివసించే వారికీ మరియు చెక్క బొమ్మలు తయారు చేసే ప్రాంతీయ కళాకారులకు అనేక కొత్త ఉపాధి అవకాశాలను కల్పిస్తుందని భావిస్తున్నారు. ఈ పార్క్‌లో టాయ్ మ్యూజియం, కామన్ ఫెసిలిటీ సెంటర్, రీసెర్చ్ & డెవలప్‌మెంట్ సదుపాయం, స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ మరియు చిల్డ్రన్స్ అమ్యూజ్‌మెంట్ పార్క్ సౌకర్యం కూడా ఉంది. 16 మంది బొమ్మల తయారీ పారిశ్రామికవేత్తలకు మంత్రి కేటీఆర్ లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఇచ్చారు. దీనివల్ల దాదాపు 2500 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి.