mt_logo

కేసీఆర్ చేసిన త్యాగాలను గుర్తు చేసే ‘మన బాపు కేసీఆర్’ పాటను విడుదల చేసిన మంత్రి కేటీఆర్

‘‘ఉక్కు గుండెను వొక్కసారన్నతాకాలనున్నదే’’ అనే పల్లవి తో.. ప్రముఖ పాటల రచయిత గాయకుడు, మాట్ల తిరుపతి రాసి సంగీతం సమకూర్చి పాడిన పాట.. ‘ మన బాపు కేసీఆర్’ ఆడియో విజువల్ సీడీని బుధవారం ప్రగతి భవన్‌లో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. 

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ… నాడు అన్ని రంగాల్లో వివక్షకు, అవహేళనలకు గురైన తెలంగాణ ప్రజలను చైతన్యపరిచి, ఉద్యమ ఆకాంక్షలను రగిలించి స్వరాష్ట్రాన్ని సాధించిన నాటి ఉద్యమ రథసారథి కేసీఆర్ చేసిన త్యాగాలగు గుర్తు చేసేలా వుందని అన్నారు. స్వయం పాలనలో తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా నిలిపి నేడు తెలంగాణ బిడ్డల ఆత్మగౌరవాన్ని ఎవరెస్టు శిఖరమంత ఎత్తున నిలిచేలా చేసిన నేటి మన ముఖ్యమంత్రి కేసీఆర్ అచంచల పట్టుదలను  తలుచుకుంటూ వారి ఔన్నత్యాన్ని చాటుతూ గాయకుడు  మాట్ల తిరుపతి రాసిన పాట గుండెలకు హత్తుకునేలా వున్నదని మంత్రి కేటీఆర్ తెలిపారు.

మన బాపు కేసీఆర్ పాట ప్రతి వొక్కరి హృదయాన్ని కదలించేలా ఆలోచింపచేసేలా ఉందన్నారు. తన జీవితమంతా తెలంగాణ కోసమే అంకితం చేసి, ప్రజా ఆకాంక్షలను నిజం చేస్తున్న సిఎం కేసీఆర్ తెలంగాణ ప్రజల గుండెల్లో కొలువైవున్నాడని, అదే భావనను తన పాట రూపంలో వ్యక్తీకరించినందుకు అభినందించారు. ఈ పాటను సమర్పించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఫౌండర్., రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ను  నిర్మాత ఎస్ రాఘవ, డైరెక్టర్ పూర్ణను మంత్రి కేటీఆర్ అభినందించారు.కాగా.. ‘మన బాపు కేసీఆర్’ పాటను అద్భుతంగా తీర్చిదిద్దిన మాట్ల తిరుపతిని మంత్రి హరీశ్ రావు, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ అభినందించారు.