mt_logo

ఎస్‌జీడీ ఫార్మా కార్నింగ్‌ టెక్నాలజీ ప్లాంట్‌కు శంకుస్థాపన చేసిన మంత్రి కేటీఆర్‌ 

మహబూబ్ నగర్, జూన్ 8 :  నేడు మహబూబ్‌నగర్‌ జిల్లాలో  ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్‌  పర్యటిస్తున్నారు. మూసాపేట్ మండలం వేముల గ్రామంలో 500 కోట్ల తో ఎస్జీడీ  ఫార్మా కార్నింగ్ టెక్నాలజీ ప్లాంట్ నిర్మాణానికి మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్,మల్లారెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పడ్డనాడు దేవరకద్ర లో 40 వేల ఎకరాలకు సాగు అయ్యేది,  చెక్ డ్యామ్ లతో అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి.  దేవరకద్ర లో అద్భుతమైన చెక్ డ్యామ్ ల నిర్మాణం జరిగింది. 2023 లో 98 వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. కరివేన పూర్తి అయితే లక్ష  అరవై వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. కొత్తకోట ,దేవరకద్ర లో ప్రభుత్వ ఆసుపత్రిలను కట్టిస్తాం అన్నారు.  కరెంట్,తాగునీరు, సాగునీరు ఇవ్వని వాళ్ళు మళ్ళీ ఓట్ల కోసం వస్తున్నారు,  మళ్ళీ మాయమాటలు చెబుతూ ప్రజల ముందుకు వస్తున్నారని అన్నారు. లైఫ్ సైన్సు రంగంలో తెలంగాణ అగ్రగామిగా ఉందని చెప్పారు. 

మంత్రి మల్లారెడ్డి ప్రసంగం.. 

కాంగ్రెస్ పార్టీ నీళ్లు,కరెంటు ఇవ్వలేదు.. మళ్ళీ ఏం మొహం పెట్టుకుని జనాల్ని ఓటు వేయమని అడుగుతున్నారు, గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని అభివృద్ధి సీఎం కేసీఆర్ చేస్తున్నారని, కేటీఆర్ వేల కోట్ల రూపాయల పెట్టుబడులు  తీసుకొస్తున్నారని గుర్తు చేసారు.