mt_logo

కేసీఆర్‌కు సరితూగే నాయకులు దొరకడం అరుదు: మంత్రి కేటీఆర్

కేసీఆర్‌కు సరితూగే నాయకుడు దేశంలోనే అరుదుగా ఉంటారని ఓ ప్రముఖ ఛానల్ ఇంటర్వ్యూలో మంత్రి కేటీఆర్ తెలిపారు. మా ప్రభుత్వం కంటే ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చిన రాష్ట్రం ఏదైనా ఉందా..? ప్రశ్నించారు. మాకంటే మెరుగ్గా పనిచేసిన కాంగ్రెస్‌ పాలిత, బీజేపీ పాలిత రాష్ట్రం ఏదైనా ఉందా? కాంగ్రెస్‌, బీజేపీ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు పర్యాయాలు ఒంటరిగా గెలిచాం, మళ్లీ ఒంటరిగానే గెలుస్తామని మంత్రి కేటీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు.

సీఎం కేసీఆర్‌కు సరితూగే నాయకుడు తెలంగాణలో ఎవరూ లేరు అని తేల్చి చెప్పారు. దేశంలో కూడా అరుదుగా ఉంటారని అన్నారు. సీఎంను కావాలన్న పిచ్చి ఆలోచన నాకు లేదన్నారు. కేసీఆరే సీఎంగా ఉండాలని పార్టీ కార్యకర్తగా నేను కోరుకుంటానని మంత్రి తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టో అమలు చేయాలంటే రూ.3.5 లక్షల కోట్లు కావాలని ఎద్దేవా చేసారు. మేం ఏం అమలు చేయగలమో వాటినే మేనిఫెస్టోలో చేర్చాం అని మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేసారు.