mt_logo

మైనంపల్లి డబ్బు మైనాన్ని ఓట్లతో కరిగించాలి: హరీష్ రావు

మల్కాజ్‌గిరి నియోజకవర్గంలో మంత్రి హరీశ్ రావు సమక్షంలో బీజేపీకి  నాయకులు జీకే హన్మంత రావు, జీకే శ్రీదేవి, ఇతర నాయకులు గులాబీ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. రౌడీయిజం పేరు పెట్టుకున్న మైనంపల్లికి, మంచి వ్యక్తి మర్రి రాజశేఖర్ రెడ్డి ఈ ఎన్నికలని అన్నారు. డబ్బులు ఉన్న మైనాన్ని ఓట్లతో కరిగించాలి. నోరుందని ఇష్టం ఉన్నట్లు మాట్లాడుతున్నాడని ధ్వ‌జ‌మెత్తారు. నేను ఆయన లాగా దిగజారి మాట్లాడనన్నారు.  విజ్ఞులైన ప్రజలు ఓటుతో మైనం పల్లికి బుద్ది చెప్పాలని సూచించారు. 

ఎన్నికలు అయిపోగానే కాలనీ వాసుల సమస్యలు పరిష్కారం చేస్తాం అని హామీ ఇచ్చారు. దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తా అని మాట ఇచ్చా. నెలకు ఒక్కసారి వచ్చి మీ సమస్యలు పరిష్కరిస్తా అని చెప్పారు.మనది మంచి మేనిఫెస్టో. ప్రజల్లోకి తీసుకెళ్లాలి. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజస్థాన్‌లో హత్యలు, కిడ్నాప్‌లు, ఇంత బాగా ఉన్నపుడు రిస్క్ వద్దు. తప్పిపోయి ఓటు వేస్తే మోసపోతాం అని హెచ్చరించారు.