mt_logo

ప్రపంచంతో పోటీపడే సత్తా మనకు ఉంది : మంత్రి కేటీఆర్‌

ట్యాలెంట్‌ ఉన్న పిల్లలకు తెలంగాణాలో  కొరతలేదని, ప్రపంచంతో పోటీపడే సత్తా మనకు ఉంది, రిసోర్స్‌ క్యాపిటల్‌ ఆఫ్‌ ఇండియాగా హైదరాబాద్‌ ఎదిగిందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ప్రపంచంలో ఎక్కడెక్కడి నుంచో ఈనాడు హైదరాబాద్ కి టాలెంట్ అధికంగా వస్తుందన్నారు. సరిగ్గా 2014 లో 9 ఏళ్ళ క్రితం హైదరాబాద్ లో ఉన్న మొత్తం టెక్నాలజీ జాబ్స్ 3,23,396, కానీ ఈనాడు 2023 లో  9,05,715 జాబ్స్, అంటే 3 రేట్లు పెరిగింది. అలాగే ఐటీ  ఎగుమతులు ఆనాడు 2014 లో  57,528 కోట్లు, ఈనాడు 2023లో  2,41,275 కోట్లు అంటే 400 పర్సెంట్ 4 రేట్లు పెరిగిందని తెలిపారు. 

 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ఉండగా హైదరాబాద్‌ ఐటీలో 3 లక్షల మంది పనిచేసే వాళ్లు, ప్రస్తుతం ఆ సంఖ్య 9 లక్షలకు పైగా పెరిగిందన్నారు. ఇక్కడ ఉన్న గ్రోత్‌ దేశంలోని ఏ నగరంలో లేదన్నారు. హైదరాబాద్‌ నానక్‌రాంగూడలో రైట్‌ సాఫ్ట్‌వేర్‌ ఆఫీస్‌ను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు … వరంగల్‌లో ఐటీ కంపెనీ ఏర్పాటు చేసిందందుకు రైట్‌ సాఫ్ట్‌వేర్‌ కంపెనీకి ధన్యవాదాలు తెలిపారు. మూడేండ్లలో వెయ్యి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పినందుకు అభినందించారు. నేటితరం రైట్‌ సాఫ్ట్‌వేర్‌ సీఈవో కృష్ణను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.