తెలంగాణలో పెట్టుబడులు పెట్టే కంపెనీలకు అనుకూల వాతావరణాన్ని కల్పిస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ అన్నారు. 2030 లోపు లైఫ్ సైన్సెస్ రంగంలో 100 బిలియన్ డాలర్ల సాధనే లక్ష్యంగా పనిచేస్తున్నామని పేర్కొన్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలో థర్మో ఫిషర్స్ ఇండియా ఇంజినీరింగ్ సెంటర్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. లైఫ్ సైన్సెస్‌లో డేటా సైన్స్ కలుస్తుందన్నారు. థర్మో ఫిషర్స్ పరిశోధన, అభివృద్ధి సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నారని వెల్లడించారు. 15 మిలియన్ డాలర్ల పెట్టుబడితో ఈ సంస్థ ఏర్పడుతున్నదని చెప్పారు. దీంతో నైపుణ్యం కలిగిన 450 మందికిపైగా ఇంజినీర్లు పనిచేస్తారన్నారు.