mt_logo

సకల హంగులతో రూపొందిన నిజామాబాద్‌ ఐటీ టవర్‌ను ఆగస్టు 9న ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్

బుధవారం రోజు నిజామాబాద్‌ ఐటీ టవర్‌ ను మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా  మంత్రి కేటీఆర్‌ తన ట్విట్టర్‌ వేదికగా విల్లడించారు. నిజామాబాద్‌ నగరంలోని గిరిరాజ్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలో బైపాస్‌ రోడ్డుకు ఆనుకొని ఉన్న 3.5 ఎకరాల ప్రభుత్వ భూమిని ఐటీ టవర్‌ కోసం కేటాయించారు.ఎకరం భూమిలో ఐటీ టవర్‌ను డిజైన్‌ చేశారు. రూ.50 కోట్ల వ్యయంతో 49,460 చదరపు అడుగుల విస్తీర్ణంలో దీనిని నిర్మించారు.  ఇందులో టీ-హబ్‌, టాస్క్‌ సెంటర్లను కూడా నిర్మించారు. దీని ద్వారా తెలంగాణ అభివృద్ధిలో యువత కూడా పాలు పంచుకునే అవకాశం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.